సింగర్ మంగ్లీ పై తాజాగా కేసు నమోదు అయింది.గంజాయి కేసులో సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అవ్వడంతో ప్రస్తుతం ఈ వార్త మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మరి ఇంతకీ సింగర్ మంగ్లీ నిజంగానే గంజాయి సేవించిందా.. గంజాయి సేవించిన కేసులో ఈమె పేరు ఎందుకు ప్రధానంగా వినిపిస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం.. సింగర్ మంగ్లీ అంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది.అలా తన స్టార్ట్డంతో ప్రపంచ దేశాలలో కూడా తన గానాన్ని వినిపిస్తుంది. అయితే అలాంటి సింగర్ మంగ్లీ మొదట ఓ న్యూస్ ఛానల్ లో వార్తలు చెబుతూ ఫేమస్ అయింది.తన లంబాడి డ్రెస్ వేసుకొని ఆమె చెప్పే న్యూస్ కి అప్పట్లో చాలా మంది ఫిదా అయ్యారు. అలా మెల్లిమెల్లిగా న్యూస్ చెబుతూ సింగర్ గా అవతారం ఎత్తింది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో మంగ్లీ కొన్ని పాటలు కూడా పాడింది.

అలా తెలంగాణ వచ్చాక మంగ్లీ కి మంచి గుర్తింపు లభించింది.అలా ఫోక్ సాంగ్స్ పాడుతూ సింగర్ గా అవతారం ఎత్తిన మంగ్లీకి ఆ తర్వాత సినిమాల్లో కూడా సింగర్ గా అవకాశాలు వచ్చాయి. అలా తన గొంతుతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన సింగర్ మంగ్లీ పలు భక్తి పాటలు కూడా పాడింది. ఉగాది, శివరాత్రి,బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, మహిళా దినోత్సవం ఇలా ఏ పండగ అయినా ఏ ఈవెంట్ అయినా సరే సింగర్ మంగ్లీ పాటలు పాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు సంపాదించింది. అయితే అలాంటి సింగర్ మంగ్లీ తాజాగా గంజాయి కేసులో ఇరుక్కుంది.ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా సింగర్ మంగ్లీ బర్త్డే కావడంతో ఆమె చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లోగ్రాండ్గా తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చింది.

అయితే ఈ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం ఉన్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే మంగ్లీ పార్టీ ఇచ్చే రిసార్ట్ లోకి వెళ్లి స్థానిక పోలీసులు దాడులు చేశారు. అయితే పక్కా సమాచారంతో వెళ్లిన స్థానిక పోలీసులకి ఆధారాలతో సహా అందరూ దొరికిపోయారు. దాదాపు తొమ్మిది మంది గంజాయి తాగినట్టు పోలీసులు తెల్చేశారు.అయితే ఈ  గంజాయి సేవించిన 9 మందిలో సింగర్ మంగ్లీ ఉందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.ఇక బర్త్డే పార్టీ సింగర్ మంగ్లీది కావడంతో ఆమెపై అలాగే రిసార్ట్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు అయింది. దీంతో సింగర్ మంగ్లీ విషయం కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి సింగర్ మంగ్లీ కూడా గంజాయి సేవించిందా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: