టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగార్జున ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. నాగార్జున కెరియర్లో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సినిమాలలో రగడ మూవీ ఒకటి. ఈ సినిమాకు వీరు పోట్ల దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో అనుష్క శెట్టి , ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ 2010 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకుంటున్నాయి. 

ఇకపోతే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ హీరోలుగా రూపొందిన కొన్ని సినిమాలు కూడా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఇంపాక్ట్ ను చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే నాగార్జున హీరో గా రూపొందిన రగడ మూవీ ని కూడా రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రగడ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 29 వ తేదీన నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ మూవీ బృందం వారు రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రగడ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో , ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: