
మర పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా థమన్ కు ఎంతో సాన్నిహిత్యం .. పవన్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కు థమన్ కు ఉన్న సంబంధం తెలిసిందే . మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి నిర్వహించే సేవా కార్యక్రమాలకు థమన్ సపోర్టుగా ఉంటున్నారు .. అందుకే థమన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుకున్న మరుక్షణం తిరుమల లో స్పెషల్ దర్శనాలు చేసుకోగలుగుతున్నాడు .. అలాగే ఆయనతో పాటు ఆయన మిత్ర బృంధాన్ని కూడా ఎంతోమందిని ఆయన తీసుకెళ్లగలుగుతున్నారు తిరుమల ఆలయంలో ఓ కీలక పూజారి కూడా తమన్ స్నేహితుడే.
అలాగే తాను చేసే పనులను పక్కనపెట్టి అవసరమైతే సేవా కార్యక్రమాల నిధుల సేకరణకు ఎన్టీఆర్ ట్రస్ట్ కు సాయం అందిస్తున్నారు .. అదేవిధంగా తన పనులు పక్కన పెట్టి సింగపూర్ వెళ్లి జనసేన నేత పవన్ స్నేహితుడు లింగమనేని ఇంటి ఫంక్షన్లకు ఈవెంట్లు కూడా అందించగలరు. ఇలా ఆటు మెగా క్యాంపుకు మరొక నందమూరి కాంపౌండ్ కు దగ్గరగా ఉంటూ .. మరోపక్క త్రివిక్రమ్ కు ఆప్తుడుగా మరోపక్క మిగిలిన యంగ్ డైరెక్టర్ లతో బావ బావ అని పిలిమించుకోగల చనువు యంగ్ నిర్మాతలు హీరోలతో తరచూ క్రికెట్ ఆడుతూ .. కుర్రాళ్ళు కుర్రాడిగా పెద్దవాళ్ళు పెద్దవాడిగా ఎంతో హుందాగా కలిసిపోతున్నాడు .. దీని కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ కావాల్సిన అందరి వాడిగా థమన్ నిలిచిపోయాడు ..