ఎస్ ప్రెసెంట్ ఇలానే మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు.  మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్న ఇద్దరు హీరోయిన్స్ పేరును హైలైట్ చేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ల టైమింగ్ ఏంటో..? అదృష్టం ఏంటో అని మాట్లాడుకుంటున్నారు.  దీంతో  సోషల్ మీడియాలో హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ శ్రీలీల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి.  తలా తొక  లేని లాజిక్లతో సోషల్ మీడియాలో ఇద్దరు హీరోయిన్ల పేర్లను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు. దానికి కారణం అక్కినేని ఫ్యామిలీ .

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . అక్కినేని నాగార్జున తన ఇద్దరు కొడుకులను లైఫ్లో సెటిల్ చేసేసాడు.  రీసెంట్ గానే హీరో అఖిల్ పెళ్లి చేసుకున్నాడు . పెళ్లి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక విషయం కారణంగా సాయి పల్లవి-శ్రీలీల ని  హైలెట్ చేస్తున్నారు జనాలు . నిజానికి నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న మూమెంట్లో ఆయన "తండేల్"  సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

ఆ సమయంలో ఆయనకు హీరోయిన్ సాయి పల్లవి అండ్ టీం బాగా సపోర్ట్ చేశారు . మరీ ముఖ్యంగా సినిమా హిట్ అవ్వడానికి కారణం మొత్తం తీసుకెళ్లి నాగార్జున - శోభిత ధూళిపాల చేతిలో పెట్టేశారు. అయినా సరే హీరోయిన్ సాయి పల్లవి ఏం మాత్రం పట్టించుకోలేదు.  అయితే ఇప్పుడు అదే సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది శ్రీలీల అంటున్నారు జనాలు . దానికి కారణం పెళ్లి తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా "లెనిన్".  అఖిల్ బాడీ మోడలేషన్ పూర్తిగా ఈ సినిమా కోసం మార్చేసుకున్నాడు. చిత్తూరు యాసలో ఈ సినిమా ఉండబోతుంది .

చిత్తూరు ప్రాంతనేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ అప్డేట్ బయటకు వచ్చిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు . ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితే తీసుకెళ్లి జైనబ్ ఖాతాలను వేస్తాడు నాగార్జున . దాంతో సోషల్ మీడియాలో హీరోయిన్ సాయి పల్లవి ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేసిందో త్వరలోనే శ్రీలీల కూడా అదే సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అంటూ ఘాటు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు . అంతేకాదు నాగచైతన్య కి తండేల్ ఎలాగో అఖిల్ కి లెనిన్ అలాగాఏ..ఎప్పటికీ ఈ సినిమాలు గుర్తుండిపోతాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: