విజయ్ దేవరకొండ. ఈ హీరో పేరులో ఏదో మ్యాజిక్ ఉంది. ఎందుకంటే ఎంతో మంది అమ్మాయిలు ఈ హీరో పేరు చెబితే చాలు ఆయన అందమైన రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కేవలం విజయ్ దేవరకొండకు మామూలు అమ్మాయిలే కాదు హీరోయిన్లలో కూడా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతారు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తాజాగా అట్రాసిటీ కేసు నమోదు అయింది. మరి ఇంతకీ విజయ్ దేవరకొండ చేసిన తప్పేంటి.. ఎందుకు ఆయనపై అట్రాసిటీ కేసు నమోదయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. వరుస సినిమాలు చేస్తూ స్టార్డం కోసం పాకులాడుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. 

సినిమా మే 30న విడుదల తేదీని అనౌన్స్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా వేశారు. అలాగే ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు విజయ్ దేవరకొండ చేస్తున్నారు. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ పై తాజాగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.దానికి కారణం కోలీవుడ్ నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలే.. సూర్య పూజ హెగ్డే కాంబినేషన్లో వచ్చిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..భారత్ పాక్ ఉద్రిక్తతలను 5 వందల సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకున్న దాంతో పోల్చి మాట్లాడారు. ఆ ఈవెంట్లో భారత్ పాక్ మధ్య జరుగుతున్న వార్ ఎలా ఉందంటే దాదాపు 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ బుద్ధి లేకుండా ఎలా అయితే కొట్టుకున్నారో ప్రస్తుతం పాకిస్తాన్ వాసులు కూడా అలా బుద్ధిలేని పనులు చేస్తున్నారు అంటూ మాట్లాడారు.

అయితే ఆయన ఇండియా కి సపోర్ట్ గానే మాట్లాడినప్పటికీ చాలామంది గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారు. గిరిజనులు కొట్టుకున్నట్టు కొట్టుకోవడం ఏంటి అని గిరిజనులను తక్కువ చేసి మాట్లాడడం ఏంటి అని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.  అంతేకాదు తాజాగా విజయ్ దేవరకొండపై హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ విజయ్ దేవరకొండ ఈ కేసులో చిప్పకూడు తినడం ఖాయమేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ అప్పుడే గిరిజనులకు క్షమాపణలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: