- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో తెరకెక్కిన లేటెస్ట్ డివోషనల్ ఎపిక్ డ్రామా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా విష్ణు మంచు హీరోగా నటించాడు. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ కేటాయించారు. నిర్మాత మంచు మోహన్ బాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ... ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. కన్నప్ప సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేలా వెసులు బాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా రిలీజ్ రోజైన జూన్ 27 నుంచి పది రోజులు పాటు ఈ సినిమా టికెట్ రేట్లు 50 రూపాయల వరకు పెంచుకోవచ్చు. అలాగే జీఎస్టీ కూడా పెంపు ఉంటుంది.


మల్టీప్లెక్స్ , సింగిల్ స్క్రీన్స్ రెండిట్లోనూ ఈ పెంపు వర్తిస్తుందని తాజాగా ఓ జీవో జారీ అయింది. దీంతో ఏపీలో కన్నప్ప టికెట్ రేట్లు మల్టీప్లెక్స్ లలో 236 ... సింగిల్ స్క్రీన్స్ లలో 206 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కలెక్షన్లు కొమ్ముకోవచ్చు. సినిమాలో మోహన్ బాబు - అక్షయ్ కుమార్ - ప్రభాస్ - మోహన్ లాల్ - శరత్ కుమార్ - బ్రహ్మానందం లాంటి స్టార్లు నటించిన క‌న్న‌ప్ప‌కు భారీ వసూళ్లు రావటం ఖాయమని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: