కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ "దంగల్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీతో అమీర్ ఖాన్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఈ సినిమా కుస్తీ పోటీల నేపథ్యంలో తేరకెక్కింది. ఈ మూవీలో ఆమీర్ ఖాన్ నలుగురు పిల్లలకు తండ్రి పాత్రలో కనిపించాడు.

ఈ సినిమాలో అమీర్ యువకుడి పాత్రలో కుస్తీ వీరుడిగా కనిపించి , ఆ తర్వాత నలుగురు పిల్లల తండ్రి పాత్రలో వయసు మళ్ళిన వ్యక్తిగా కనిపించి రెండు గెటప్లలో కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా మహిళా కుస్తీ పోటీల నేపథ్యంలో కొనసాగుతుంది. ఓ కన్న తండ్రి సమాజం అమ్మాయిలకు కుస్తీ వద్దన్న వినకుండా , ఎవరిని పట్టించుకోకుండా తన పిల్లలను కుస్తీలో అత్యున్నత స్థాయికి ఎలా తీసుకువెళ్లాడు అనే కథతో ఈ సినిమా ముందుకు సాగుతుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో అద్భుతమైన రీతిలో కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా ఇండియాలో ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను హిందీ తో పాటు తెలుగులో కూడా విడుదల చేశారు. తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా ఈ సినిమా సూపర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే మహిళల గురించి ఎంతో గొప్పగా చూపించిన ఈ సినిమాను పాకిస్తాన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నట్లు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ మంత్రి మరియం ఔరంగజెబ్ చెప్పుకొచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ మంత్రి అయినటువంటి మరియం ఔరంగజెబ్  మాట్లాడుతూ ... నేను సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దంగల్ సినిమా విడుదల అయింది.

ఆ సమయంలో సెన్సార్ బోర్డు కొన్ని కారణాలతో సినిమాను బ్యాన్ చేయాలి అని చెప్పింది. నేను మూవీ కూడా చూడకుండానే అందుకు ఓకే చెప్పాను. ఆ తర్వాత ఒక ఏడాదిన్నరకి నేను ఆ సినిమా చూశాను. ఆ తర్వాత నేను చేసిన తప్పును తెలుసుకున్నాను. అది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే మూవీ. అలాంటి మూవీ ని బ్యాన్ చేసినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను అని ఈమె తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: