టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అని తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అనేక మంది దర్శకులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పవన్ తో సినిమా చేసే అదృష్టం మాత్రం చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే వచ్చింది. ఇకపోతే చాలా సార్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వి వి వినాయక్ కూడా పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అయినా చేయాలి అని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటివరకు పవన్ , వినాయక్ కాంబోలో మూవీ రాలేదు. కానీ పవన్ , వినాయక్ కాంబోలో ఓ సినిమా ఆల్మోస్ట్ సెట్ అయ్యే చివరి నిమిషంలో క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే కథతో వినాయక్ వేరే హీరోతో సినిమా చేసి అదిరిపోయే మాస్ హిట్ను అందుకున్నాడు. మరి పవన్ తో అనుకొని చివరిగా వేరే హీరోతో చేసి వినాయక్ హిట్ కొట్టిన ఆ సినిమా ఏది అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ , అమలా పాల్ హీరోయిన్లుగా వి వి వినాయక్ దర్శకత్వంలో నాయక్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ ని మొదట వినాయక్ , చరణ్ తో కాకుండా పవన్ తో చేయాలి అనుకున్నాడట. ఆల్మోస్ట్ ఈ కాంబో సెట్ అయ్యింది అనుకునే సమయంలో కొన్ని కారణాల వల్ల ఆ మూవీ క్యాన్సల్ అయ్యిందట. దానితో వినాయక్ అదే కథతో చరణ్ హీరోగా నాయక్ అనే టైటిల్ తో మూవీని రూపొందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: