తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటిమనులలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. కీర్తి సురేష్ "నేను శైలజ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన మహానటి సినిమా అద్భుతమైన విజయం సాధించడం, ఆ మూవీ లో ఈమె నటనకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో ఈమెకు నటిగా అద్భుతమైన గుర్తింపు ఈ సినిమా ద్వారా వచ్చింది.

ఇది ఇలా ఉంటే ఈమె మహానటి సినిమా తర్వాత అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది. కానీ ఇప్పటివరకు ఆమెకు మహానటి స్థాయి విజయం మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా దక్కలేదు. తాజాగా ఈ బ్యూటీ ఉప్పు కప్పు రంబు అనే సినిమాలో నటించింది. ఈ మూవీ లో కీర్తి సురేష్ సుహాస్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ lo విడుదల కానుంది. ఈ సినిమా జులై 4 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రైమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ స్ట్రీమింగ్ తేదీ దగ్గర పడడంతో కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఉప్పు కప్పు రంబు సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజాగా కీర్తి సురేష్ మాట్లాడుతూ... ఉప్పు కప్పు రంబు సినిమా యొక్క చిత్రీకరణ మొత్తం 28 రోజుల్లో పూర్తి అయ్యింది అని చెప్పుకొచ్చింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో తాను చిన్నప్పటి నుండి కూడా సినిమాల్లోకి రావాలి అని అనుకుంటున్నాట్లు తెలిపింది. అలాగే పెళ్లి తర్వాత జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నట్లు ఈమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks