2025 ఫస్టాఫ్ లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది `కోర్ట్`. నూతన దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ లీగల్ డ్రామాను న్యాచురల్ స్టార్ నాని నిర్మించారు. ప్రియదర్శి పులికొండ, హర్ష్‌ రోషన్, శివాజీ ప్రధాన పాత్రల‌ను పోషించగా.. కాకినాడ శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. మార్చిలో విడుదలైన కోర్టు మూవీ బాక్సాఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో జాబిలిగా న‌టించి ప్రేక్ష‌కుల హృద‌యాలు దోచుకున్న శ్రీ‌దేవి ఆప‌ళ్ల‌ గుర్తుందా? కాకినాడ‌కు చెందిన ఈ బ్యూటీ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతోంది.


సోష‌ల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమ‌స్ అయిన శ్రీ‌దేవి.. గ‌తంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఆదికేశ‌వ‌` మూవీతో గుర్తింపు లేని పాత్ర‌లో మెరిసింది. ఆ త‌ర్వాత కోర్ట్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. అయితే తాజాగా శ్రీ‌దేవి ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేసింది. కారు కొన‌డం నా డ్రీమ్ అని పేర్కొంటూ `ఎంజీ హెక్ట‌ర్` కారుతో ఫ్యామిలీ మెంబ‌ర్స్ క‌లిసి దిగ‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది.


శ్రీ‌దేవి కొనుగోలు చేసిన ఈ కారు ధ‌ర రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఇంట‌ర్ చ‌దివే వ‌య‌సుకే అన్ని ల‌క్ష‌లు విలువ చేసే కారు కొందంటే శ్రీ‌దేవి గ్రేట్ అనే చెప్పుకోవ‌చ్చు. కాగా, కోర్ట్ త‌ర్వాత శ్రీ‌దేవికి బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు వ‌స్తాయ‌ని అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఇంత వ‌ర‌కు ఈ బ్యూటీ నుంచి కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఎటువంటి అనౌన్స్‌మెంట్స్ లేదు. కానీ నెట్టింట మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో ఈ శ్రీ‌దేవి తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: