
చిన్న బడ్జెట్ తో పూర్తి సినిమాను లాగేస్తారు . ఒకవేళ సినిమా ఫ్లప్ అయినా కూడా వాళ్ళకి నష్టాలు రాకుండా ఉండేలానే ప్లాన్ చేసుకుంటారు . ఇక ప్రాబ్లం అంతా వచ్చింది ఈ మిడిల్ హీరోలతో . మిడ్ రేంజ్ హీరోలు అలా అని హై బడ్జెట్ పెట్టలేరు అలానే లో బడ్జెట్ సినిమాలను ఓకే చేయలేరు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మిడ్ హీరోలు నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలిపోతుంది . ఆ లిస్టులో శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , వరుణ్ తేజ్ , అల్లరి నరేష్ ,గోపిచంద్ ,నితిన్ లాంటి స్టార్స్ కూడా ఉండడం గమనార్హం.
రీసెంట్గా నితిన్ నటించిన తమ్ముడు సినిమా అట్టర్ ప్లాప్ అయింది . ఈ సినిమాకి ఫుల్ నెగటివ్ టాక్ వచ్చింది . కానీ సినిమాకి మాత్రం హై బడ్జెట్ పెట్టారు దిల్ రాజు అంటూ ప్రమోషన్స్ లో కూడా చాలామంది మాట్లాడుకున్నారు . అయితే కథ కంటెంట్ బాగాలేని సినిమాకి దిల్ రాజు లాంటి వాళ్ళు ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టారు..?? అనేది కూడా ట్రెండ్ అవుతుంది. కొంతమంది రాంగ్ హీరోస్ ని చూస్ చేసుకుంటున్నారు అంటుంటే..ఇంకొంతమంది సినిమా చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒక ప్రాజెక్టులో తల దూర్చేసి ఉండడం బెటర్ అనే విధంగా చేస్తున్నారు అంటున్నారు.
నిర్మాతలు కూడా అందుకు తానా అంటే తందానా అంటున్నారు. సినిమాలు తీయకుండా ఉండడం కన్నా కూడా దొరికిన హీరోతో ఏదో ఒక సినిమా తీస్తే బెటర్ అనే విధంగానే ముందుకెళ్తున్నారు . అలా సినిమాలు తీస్తే వాళ్ళ కెరియర్ కి నెగిటివ్ మార్క్ వస్తుంది అన్న సంగతి మర్చిపోయారో ఏమో..? ఇక ఈ మిడ్ రేంజ్ హీరోలకి కొత్త కష్టాలు స్టార్ట్ అయ్యాయి . ఇకనైనా ఈ హీరోలు కథ విషయంలో కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి . తమ దగ్గరకు వచ్చిన డైరెక్టర్ కి కథ బాగో లేకపోతే నో అని చెప్పే ధైర్యం ఉండాలి . లేక లేక సినిమా వచ్చింది ఆ సినిమా పోతే మరో సినిమా రాదు అని అన్ని సినిమాలను ఓకే చేశారా ..? అంతే సంగతులు ఇండస్ట్రీలో వాళ్ల పేరు ఇక ఫ్లాప్ హీరోల లిస్టులో చేరిపోయినట్లే . చూడాలి ఎలా తన నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు అనేది..!!?