కొన్ని సంవత్సరాల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఏ ఏం రత్నం అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ తో కమల్ హాసన్ కి హీరోగా సూపర్ సాలిడ్ గుర్తింపు దక్కింది. అలాగే దర్శకుడిగా శంకర్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ హీరోగా శంకర్ "భారతీయుడు 2' అనే సినిమాను రూపొందించాడు.

మూవీ లో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో నటించాడు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు నిర్మించారు. భారీ అంచనాల నడుమ కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ తో లైకా సంస్థ వారికి భారీ ఎత్తున నష్టాలు కూడా వచ్చాయి. ఇకపోతే తాజాగా భారతీయుడు మూవీ కి నిర్మాత అయినటువంటి ఏ ఏం రత్నం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా భారతీయుడు మూవీ కి నిర్మాతగా వ్యవహరించిన ఆయన భారతీయుడు 2 మూవీ కి ఎందుకు నిర్మాతగా వ్యవహరించలేదు అనే విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా రత్నం  గారు మాట్లాడుతూ ... శంకర్ గారు చాలా కాలం క్రితమే లైక్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత ఏదో సినిమా ఎందుకు అని చెప్పి భారతీయుడు 2 చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వారు భారతీయుడు 2 సినిమా చేశారు  అని రత్నం గారు చెప్పుకొచ్చారు. ఇకపోతే తాజాగా ఏ ఏం రత్నం , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరి హర వీరమల్లు సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: