
ఎంఎం కీరవాణి తండ్రి వయసు 92 సంవత్సరాలు గడిచిన కొన్ని గంటల క్రితం హైదరాబాదులో కన్నుమూసినట్లుగా వినిపిస్తున్నాయి. కీరవాణి తండ్రి తెలుగు సినీ ఇండస్ట్రీలో చత్రపతి, సై, బాహుబలి, rrr తదితర చిత్రాలకు పాటలు రాశారు. కొన్ని చిత్రాలకు కూడా స్క్రీన్ రైటర్ గా కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ శివశక్తి ఇద్దరూ కూడా సోదరులే.. అయితే తాజాగా ఈ ఘటన తెలిసి అటు అభిమానులు పలువురు సిని సెలబ్రిటీలు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. 2007లో విడుదలైన చంద్రహాస్ సినిమాకి డైరెక్టర్ గా కూడా పనిచేశారు శివశక్తి దత్త. అలాగే బాహుబలి సినిమాలోని మమతల తల్లి పాటకు కూడా ఉత్తమ గీత రచయితగా నామినేట్ అయ్యారు. చివరిగా 2024లో పనుమాన్ చిత్రానికి పనిచేశారు.
ఇక కీరవాణి కూడా పలు రకాల టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కీరవాణి తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా తన సంగీతాన్ని అందించారు. కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కూడా హీరోగా పలు చిత్రాలలో నటించారు. మరి ఈ విషయం పైన అటు ఎంఎం కీరవాణి తండ్రి మరణానికి గల కారణాలను తెలియజేస్తారేమో చూడాలి మరి.