
ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ కీలకం. ఫస్ట్ ఆఫ్ యావరేజ్ గా ఉన్న సెకండ్ ఆఫ్ బలంగా ఉంటే హిట్ కొట్టేయొచ్చు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు కూడా బలమైన సెకండాఫ్ కావాలి. 2025 తొలి భాగం టాలీవుడ్కు చేదు ఫలితాలను మిగిల్చింది. సంక్రాంతి వెలుగు తప్పితే మిగిలిన సీజన్ అంత డీలా పడింది. సమ్మర్ సీజన్ అంత పూర్తిగా నిరాశపరిచింది. థియేటర్లు రన్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. కోర్ట్ - మ్యాడ్ - హిట్ 3 - సింగిల్ లాంటి చిన్న చిన్న సర్ప్రైజులు ఉన్నాయి. కుబేర - కన్నప్పతో ఓ మోస్తరు ఇంటర్వెల్ బ్యాంగ్ దొరికింది. ఇప్పుడు భారమంతా సెకండ్ హాఫ్ మీదే ఉంది. సెకండ్ హాఫ్ లో తొలి పెద్ద సినిమాగా పవన్ కళ్యాణ్ వీరమల్లు వస్తోంది. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వారం రోజులకే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఉంది. ఈ రెండు పెద్ద సినిమాలు ఇక ఆగస్టులో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ ముందుకు దిగుతున్నాయి. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ వార్ 2 సినిమా - రజనీకాంత్ కూలీ సినిమాలు ఒక రోజు తేడాలో రిలీజ్ అవుతున్నాయి.
వార్ 2 కు తెలుగు లో ఇంత బజ్ రావడానికి కారణం ఎన్టీఆర్. ఎన్టీఆర్ హిందీలో నటించిన తొలి సినిమా ఇది. ఇక కూలీ సినిమాలో రజనీకాంత్ - నాగార్జున - ఉపేంద్ర - శృతిహాసన్ - పూజా హెగ్డే ఇలా పెద్ద తారాగణం ఉంది. ఈ రెండు సినిమాలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు బద్దలు కొడతాయని అంచనాలు ఉన్నాయి. రవితేజ మాస్ జాతర కూడా ఆగస్టులో రాబోతుంది. ఇక దసరాకు నందమూరి బాలకృష్ణ అఖండ 2 వస్తోంది. ఇదే డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రెడీ అవుతోంది. తేజ సజ్జా మిరాయ్ సినిమాతో వస్తున్నాడు. సెప్టెంబర్ ఐదున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రభాస్ డిసెంబర్లో రాజా సాబ్ గా వస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఈ యేడాదిలోనే వస్తుంది. నిఖిల్ స్వయంభు - అడవి శేష్ డెకాయిట్ - సాయి తేజ సంబరాల ఏటిగట్టు - సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా లాంటి సినిమాలు కూడా ఈ ఏడాది రాబోతున్నాయి. మరి ఈ సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ కచ్చితంగా సెకండాఫ్లో గట్టి ఎక్కుతుందని భావించాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు