
ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే కావడంతో అటు రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాపై ఓ కన్ను వేశారు . అయితే అంత సరిగ్గా ముందుకు వెళ్లిపోతుంది అనుకున్న టైంలో హరిహర వీరమల్లుపై సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . జూలై 24న అమావాస్య . సాధారణంగా తెలుగు జనాలు అమావాస్య రోజు ఏ శుభకార్యాన్ని ఏ మంచి పని స్టార్ట్ చేయరు. కొందరు అమావాస్యని చెడుగా భావిస్తూ ఉంటారు . ఆ రోజున ఏ మంచి పని చేసిన అది అపశకునంగా మారిపోతుంది అని ఫ్లాప్ అవుతుంది అని కొందరి నమ్మకం.
ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అవుతుంది అనే రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. జూలై 24 న అమావస్య కావడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు . గురువారం విడుదల చేస్తే లాంగ్ వీకెండ్ లాభం అందుకోవచ్చు అని మేకర్స్ భావిస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో అమావాస్య చెడు దినంగా భావించడం ఓ మైనస్ పాయింట్ గా మారుతుందేమో అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . అయితే పవన్ మ్యానరిజం ఆ సెంటిమెంట్ ని తుడిచి పెట్టేస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు .
కానీ కొంతమంది మాత్రం ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదిక గా ట్రోల్ చేస్తున్నారు . సుమారు ఐదేళ్లుగా సెట్స్ మీద ఉండి ఎన్నో అవాంతరాలు ఇబ్బందులు పడి చివరికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా సరిగ్గా అమావాస్య రోజునే ఎందుకు విడుదల చేస్తున్నారు..?? అనేది ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్ గా మారింది . కొంతమంది దీన్ని కొట్టి పడేస్తుంటే ..కొంతమంది ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటుందేమో..?? అంటూ కూడా భయపడుతున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తో అమావాస్య సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..? లేదా..? అన్నది తెలియాలి అంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే..!