
అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ మీద నవంబర్ 2025 లో ఫుల్ పోస్టర్ని విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు రాజమౌళి. అయితే ఈ పోస్టర్లో మాత్రం మహేష్ బాబు మెడలో త్రిశూలం నందితో కూడిన ఒక లాకెట్ ధరించినట్లు కనిపిస్తోంది. అలాగే ఈ లాకెట్ తో పాటు మెడ పైన కొంతమేరకు రక్తం కారుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు మాత్రం సంబరపడిపోతున్నారు. కానీ పోస్టర్ మొత్తం రివిల్ చేయకపోయినప్పటికీ కేవలం చాతి పిక్ తోనే సినిమాకి అంచనాలు పెంచేస్తున్నారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మరొక పోస్టులో మాత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులతో పాటుగా మహేష్ ఫ్యాన్స్ కి తెలియజేస్తూ.. తాము కొద్ది రోజుల క్రితమే సినిమా షూటింగ్ అని ప్రారంభించాము ఈ సినిమా గురించి తెలుసుకోవాలనే తపనను మేము అర్థం చేసుకోగలము .. సినిమా స్టోరీ కానీ స్కోప్ కానీ చాలా పెద్దదిగా ఉన్నదని అందుకే ఫొటోస్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లకు ఎక్కడ న్యాయం చేయలేదని భావిస్తున్నానని తెలిపారు. సినిమాను మీకు ఎంతో అద్భుతంగా చూపించాలనే తపన మాకు కూడా ఉందని అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. నవంబర్ 2025 వరకు ఫస్ట్ లుక్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఎన్నడూ చూడని సినిమాతో మీ ముందుకు రాబోతున్నామని తెలియజేశారు రాజమౌళి.