
వార్2 మూవీకి యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే సరైన స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడం ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు. వార్2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగినా తారక్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి తెలుగు మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు.
మంచి సినిమా తీస్తే సరిపోదని ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ప్రమోషన్స్ కూడా చేయాలనీ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమా దాదాపుగా 3 సంవత్సరాల పాటు షూటింగ్ ను జరుపుకొందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉన్నాయని దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఈ సినిమాతో భారీ సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నమ్మకం మెజారిటీ సినిమాల విషయంలో నిజమైన సంగతి తెలిసిందే. అదే విధంగా వార్2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వార్2 మూవీ నిడివి 2 గంటల 51 నిముషాలు కాగా ప్రేక్షకులను మెప్పిస్తే సులువుగా వార్2 మూవీ టార్గెట్ ను సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు