
తుషార్ జలోటా దర్శకత్వంలో జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `పరమ్ సుందరి` త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 29న రిలీజ్ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్ ను బయటకు వదిలారు. అయితే ట్రైలర్ చివర్లో సౌత్, నార్త్ అనే బేధాభిప్రాయాలు లేవని, అందరూ ఇండియన్ హీరోలే అని చెప్పే సందర్భంలో జాన్వీ కపూర్ ఇక్కడి హీరోల పేర్లను, వాడి బాడీ లాగ్వేజ్ ను అనుకరించింది.
ఈ క్రమంలోనే మలయాళంలో మోహన్ లాల్, తమిళ్ కు రజనీకాంత్, తెలుగులో అల్లు అర్జున్, కన్నడలో యశ్ అంటూ ఆయా ఫిల్మ్ ఇండస్ట్రీస్‌కి వీళ్ళే ఐకాన్ అన్నట్టుగా డైలాగ్ చెప్పింది జాన్వీ. దీంతో సోషల్ మీడియాలో రచ్చ ప్రారంభమైంది. నార్త్‌లో భారీ పాపులరిటీ సొంతం చేసుకున్న మొదటి టాలీవుడ్ హీరో ఎవరు అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.
తెలుగులో ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉన్నా జాన్వీ మాత్రం అల్లు అర్జున్ పేరే చెప్పడంతో ఆ హీరో ఫ్యాన్స్ ఆనందంతో తెగ ఉప్పొంగిపోతున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నిజానికి టాలీవుడ్ నుంచి ఉత్తరాదిన భారీ స్టార్డమ్ అందుకున్న మొదటి హీరో ప్రభాస్. అయితే పరమ్ సుందరి ట్రైలర్‌లో అల్లు అర్జున్ తోపు అన్నట్లుగా చూపించడం డార్లింగ్ ఫ్యాన్స్ జీర్ణయించుకోలేకపోతున్నారు. దీంతో మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉండంగా.. మధ్యలోకి మహేష్ అభిమానులు కూడా దూరారు. అసలు ప్రభాస్, బన్నీ కన్నా మహేష్ బాబుకే నార్త్‌లో ఎక్కువ క్రేజ్ ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ఫ్యాన్ వార్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.