బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన వారం రోజుల్లోనే హౌస్ లో హంగామా, గొడవలు, సాడిజం అంతా మొదలైపోయాయి. ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే – మొదటిసారిగా కామనర్స్ కి ఛాన్స్ ఇస్తూ బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే స్పెషల్ టాస్క్ నిర్వహించారు. అందులోంచి 13 మందిని ఫైనల్ చేసి, ఆడియన్స్ ఓటింగ్ తో ముగ్గురు – జడ్జెస్ ఎంపికతో మరో ముగ్గురు హౌస్ లోకి అడుగుపెట్టారు. వీళ్లని “ఓనర్స్” గా ఎంటర్ చేయగా, మిగతా సెలబ్రిటీస్ మాత్రం “టెనంట్స్” గా హౌస్ లో ఉన్నారు. ఇక మొదటి వారం నుంచే ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ టాస్కులు మొదలయ్యాయి. కానీ కామనర్స్ గా వెళ్లిన ఓనర్స్ మాత్రం అసలైన హౌస్ యజమానుల్లా ప్రవర్తిస్తూ ఓవర్ డామినేషన్ చూపిస్తున్నారు.
 

ప్రేక్షకులు వీళ్ల ఆటలోని అహంకారం తట్టుకోలేకపోతున్నారు. హోస్ట్ నాగార్జునే వీళ్ల ప్రవర్తనపై క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ ప్రవర్తన ఆడియన్స్ కే కాక నాగ్ కూ కూడా ఇబ్బందిగానే అనిపించింది. మరిన్ని కామనర్స్ కంటెస్టెంట్స్ లో మనీష్, ప్రియ, శ్రీజ మొదట్లో అగ్నిపరీక్ష సమయంలో చూపిన ఫైర్ ఇప్పుడు కనిపించట్లేదు. డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల కూడా కేవలం నంబర్ ఫిల్లింగ్ లా ఉన్నారు. జడ్జెస్ – అభిజిత్, నవదీప్, బిందుమాధవి, హోస్ట్ శ్రీముఖి ఈ ఆరుగురిని ఎంచినప్పుడు ప్రేక్షకులు చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఇప్పటివరకు వాళ్లు చూపిస్తున్న గేమ్ మాత్రం డిజర్వ్ కాదనిపించేలా ఉంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే, అక్కడా పరిస్థితి అంత బాగోలేదు.

 

రీతు చౌదరి, ఇమ్మాన్యుయెల్ లాంటి చిన్న తెర నటులు హౌస్ కి కొంత కలర్ తీసుకొచ్చినా, రాము రాథోడ్ – సుమన్ శెట్టి మాత్రం పర్ఫార్మెన్స్ లో విఫలమయ్యారు. తనూజ, భరణి లాంటి సీరియల్ బ్యాచ్ కంటెంట్ ఇవ్వడంలో వెనుకబడ్డారు. సంజన మాత్రం ఎప్పుడూ ఏదో అరుస్తూనే ఉంటుంది. ఫ్లోరా షైనీ హౌస్ లోకి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు.మొత్తానికి మొదటి వారం నుంచే హౌస్ లో కామనర్స్ – సెలబ్రిటీస్ ఇద్దరూ కూడా నిరాశపరిచేలా గేమ్ ఆడుతున్నారు. ప్రేక్షకులు “ఈ సీజన్ కూడా అసలు బాగుండదేమో” అనే ఫీలింగ్ లో ఉన్నారు. నాగార్జున ప్రయత్నిస్తున్నా, కంటెస్టెంట్స్ ఆటలో ఫైర్ కనిపించకపోవడం వల్ల హౌస్ మీద ఇంట్రెస్ట్ పడిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకో 100 రోజులు వీళ్లతో ఎలా సాగుతుందో చూడాలి కానీ, బిగ్ బాస్ 9 మొదటి వారమే ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: