
అలాంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఇక అభిమానులు ఊరుకుంటారా? సోషల్ మీడియా వేదికగా రచ్చరంబోలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు, ఆయన సినిమాలకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటించారు. సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్స్ కూడా అందుకున్నారు. అయితే ఆయన తన కెరీర్‌లో ఎక్కువసార్లు చూసిన సినిమా ఏదంటే, ఆయన తన తొలి దర్శకత్వంలో తీసిన ‘జానీ’ మూవీయే అని ఇంటర్వ్యూలో చెప్పారు.
నిజమే, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినా "జానీ"కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు, అభిమానులను కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమా మాత్రం ఆయనకు చాలా దగ్గరగా ఉంటుందని ఆయన పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రేణు దేశాయ్ నటించడం మరో ప్రత్యేకత. ‘జానీ’ సినిమాను సూపర్ డూపర్ హిట్ అవుతుందనే ఆశతో డైరెక్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. కానీ కథ, కాన్సెప్ట్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో సినిమా అనుకున్న స్థాయిలో రాణించలేదు. అయినప్పటికీ ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆయన తన కెరీర్‌లో ఎక్కువసార్లు చూసిన సినిమా కూడా ఇదే. అంత ఇష్టంగా ఆయన ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే, ‘జానీ’ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ కళ్యాణ్ స్వయంగా స్టేజ్ ఈవెంట్స్‌లో కూడా ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు.