
ఈ పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చలు మరింత జోరుగా జరుగుతున్నాయి. పాతకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా తక్కువ, ప్రేక్షకులు ఎక్కువ ఉండేవారని, మంచి కథ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుని హీరోలు నటించేవారని, అందువల్ల సినిమాలు ఎక్కువగా సక్సెస్ అయ్యేవని చాలా మంది చెబుతున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బడ్జెట్ మీదే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా కంటెంట్ కన్నా ప్రమోషన్స్, బడ్జెట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఫలితంగా అతి పెద్ద పెట్టుబడులు పెట్టి తీసిన సినిమాలు కూడా పతనమవుతున్నాయి.
ఇక మరోవైపు, ఈ కాలంలో హీరోల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి వారం కొత్త హీరోలు వస్తుండటంతో పోటీ స్థాయి చాలా ఎక్కువైపోయింది. కానీ మంచి కథలు మాత్రం అంతగా రాబడటం లేదు. అదే కథలు, అదే ఫార్ములాలను మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తూ తీస్తుంటే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. దీంతో వారు సినిమాలను తిరస్కరిస్తున్నారు. కథ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. లేకపోతే వారు ఆసక్తి చూపడం లేదు. సినీ ప్రేమికులు కూడా ఇదే విషయం మీద ఘాటుగా స్పందిస్తున్నారు. కొత్త ఆలోచనలతో, వినూత్న కంటెంట్‌తో సినిమాలు తీస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుందని వాళ్లు చెబుతున్నారు. స్టార్ హీరోలు కేవలం తమ పేరు మీదనే సినిమాలు నడుస్తాయని అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సరే, తన సినిమాను సక్సెస్ చేయడానికి గట్టి కష్టపడాలి, ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. సినిమా హిట్ కాకపోతే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు సింపుల్‌గా రిలీజ్ అయి, మౌత్‌టాక్‌తోనే సక్సెస్ సాధించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ సినిమా హిట్ కావాలంటే కంటెంట్ బలంగా ఉండాలి, ప్రమోషన్ ప్లాన్ సాలిడ్‌గా ఉండాలి. లేని పక్షంలో పెద్ద హీరోల సినిమాలు కూడా ఫెయిల్ అవుతాయి. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు నిజంగానే బ్యాడ్ టైమ్ నడుస్తుందని ట్రోలింగ్ కూడా ఎక్కువగా జరుగుతోంది. ఈ పరిస్థితి నుండి స్టార్ హీరోలు, సినిమా ఇండస్ట్రీ ఎలా బయటపడతాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. బాక్సాఫీస్ వద్ద మళ్లీ బంగారు రోజులు రావాలంటే నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. లేని పక్షంలో ఈ “బ్యాడ్ టైమ్” ఇంకా కొనసాగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..!