పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతున్న చిత్రం “ఓజీ”. ఈ సినిమా విడుదలకు ముందే ఏర్పడిన హైప్ అంచనాలకు మించి ఉంది. ట్రైలర్స్, టీజర్స్‌తోనే ఆ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఫలితంగా, రిలీజ్ రోజుకి ముందే ఈ సినిమా రికార్డు స్థాయిలో బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్‌లో కూడా “ఓజీ” కి తిరుగులేని క్రేజ్‌తో అదిరిపోయే వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్రీమియర్ షోలు ప్రారంభం నుంచే టికెట్లు క్షణాల్లో సేల్ అవ్వడం, హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ను మరింత స్పష్టంగా చూపించింది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ప్రీమియర్ షోలు ద్వారానే 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూలు చేయడం సంచలనం కంటే తక్కువేమీ కాదు.


ఇది టాలీవుడ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లోనూ రికార్డు స్థాయి ప్రీమియర్ కలెక్షన్‌గా నిలిచింది. ఇలాంటి ఫీట్ సాధించడం పవన్ కళ్యాణ్ ఇమేజ్‌తో పాటు, దర్శకుడు సుజీత్ రూపొందించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ పై ఉన్న నమ్మకం. ఇంత భారీ స్థాయి ప్రీమియర్ కలెక్షన్ల తర్వాత, ఫస్ట్ డే వసూళ్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఓజీ సినిమాకు థమన్ సంగీతం అందించగా, నిర్మాణం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్వహించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ కీలకమైన ప్రతినాయకుడిగా ప్రేక్షకులను అలరించనున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: