
మొదట్లో వచ్చిన సినిమాలు అంతగా హిట్ ఇవ్వలేదు. కానీ తమ్ముడు, తొలిప్రేమ, బద్రి చిత్రాలు కొంత ఉత్సాహం ఇచ్చాయి. ఆ తర్వాత ఖుషి సినిమా ద్వారా మొదటి బ్లాక్‌బస్టర్ అందుకొని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు. 2001 లో విడుదలైన ఖుషి అభిమానులకు ఫుల్ మీల్ ఇచ్చిన సినిమా. అయితే, ఆ తర్వాత పవన్ ఎదుర్కొన్న పరిస్థితుల గూరించి చెప్పాలి. జల్సా మాత్రమే పరిమిత విజయాన్ని ఇచ్చి, దాదాపు 10–12 సంవత్సరాలు ఫ్లాప్‌ల పరంపర కొనసాగింది. కానీ 2013 లో అత్తారింటికి దారేది సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ రికార్డ్ సృష్టించారు. ఖుషి తర్వాత ఆ రేంజ్ లో ఈ సినిమా కూడా పెద్ద హిట్‌గా నిలిచింది.
అక్కడి నుంచి మళ్లీ షరా మామూలే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు కొంతమేరే యావరేజ్ గా మాత్రమే నిలిచాయి. ఈ క్రమంలో, 12 సంవత్సరాల తర్వాత “They Call Him OG” రిలీజ్ అయి, అభిమానులకు ఫుల్ మీల్ అందిస్తుందన్న టాక్ ఇప్పటికే ప్రీమియర్ షోల దగ్గర నుంచి వినిపిస్తోంది.ఈ విషయాన్ని చూస్తే, ప్రతి 12 సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులు రాసి, క్రేజ్ రీబూట్ అవ్వడం ఒక ట్రెండ్ లాంటిది. OG సినిమా కూడా అద్భుతమైన హిట్ టాక్, యాక్షన్ సీన్స్, స్టైలిష్ ఎంట్రీలతో మళ్లీ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో నింపుతోంది. అంటే.. పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఎప్పటికీ డౌన్ అవ్వదు, ప్రతి దశలో కొత్త చరిత్ర సృష్టించడమే ఆయన ప్రత్యేకత.