
పృథ్వీరాజ్ సుకుమారన్ వేరే భాషల్లో నటించాలంటే కేవలం భారీ రెమ్యునరేషన్ ఒక్కటే చూసుకోడు. తన పాత్ర ప్రాధాన్యం, పెర్ఫార్మన్స్ కు ఎంత స్కోప్ ఉంది, కథలో ఆ పాత్ర ఎంత కీలకం అనే విషయాలన్నీ క్షుణ్ణంగా చెక్ చేసుకుంటాడు. ఈ ఫార్ములా వల్లే ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం చర్చనీయాంశం అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మాస్ టాలీవుడ్ పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం ఉన్నట్టు మలివుడ్ నుంచి హాట్ రిపోర్ట్ బయటకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో 'ఓజి' (OG) లాంటి సంచలన సినిమా ఇచ్చిన దర్శకుడు సుజిత్, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ న్యాచురల్ స్టార్ నానితో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి 'బ్లడీ రోమియో' అనే మాస్ టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం సుజిత్ స్క్రిప్ట్ వర్క్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ 'బ్లడీ రోమియో' రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదట. ఇందులో వయొలెన్స్ తో కూడిన యాక్షన్, ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులకు ఎదురుకాని ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుజిత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ సుజిత్‌ని మెచ్చుకున్నాడు. "ఇలాంటి వరల్డ్ ఎలా సృష్టించావంటూ" కితాబిచ్చాడు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య బలమైన బాండింగ్ ఉంది. ఒకవేళ నాని మూవీ కోసం సుజిత్ నిజంగా ఒక పవర్ ఫుల్, విలక్షణమైన పాత్రను డిజైన్ చేసి పృథ్వీరాజ్‌ని అడిగితే... ఆయన 'నో' చెప్పకపోవచ్చు! సుజిత్ మాస్ విజన్‌కు, పృథ్వీరాజ్ మాస్ పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న బ్లడీ రోమియోలో ఈ విలక్షణ నటుడు ఉంటే, థియేటర్లో వైబ్రేషన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి అనడంలో సందేహం లేదు. కాకపోతే, దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 'ఓజి' మేనియా ఎంజాయ్ చేస్తున్న సుజిత్, థియేటర్ రన్ అయ్యాక నాని ప్రాజెక్ట్ పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కానున్నారు. తెలుగులో పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ స్టార్ నుంచి మన టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్గా మారడం ఖాయం! రాజమౌళి సినిమాతో పాటు నాని-సుజిత్ మూవీలో కూడా పృథ్వీరాజ్ నటించే అవకాశం ఉందంటే... ఏ పాత్రలో చూడాలని మీరు ఆశిస్తున్నారు?