
పవన్ కు శుభాకాంక్షలు చెప్పడం బాక్స్ ఆఫీస్ నెంబర్స్ గురించి మాట్లాడటం చర్చనీయాంసంగా మారింది . అప్పటికే ఫ్యాన్స్ ఈ ట్వీట్ ను డిలీట్ చేయాలనే డిమాండ్ కూడా చేశారు . ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది . " షేమ్ ఆన్ యు " అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది . దీంతో రచ్చ మరింత ఎక్కువైందని చెప్పుకోవచ్చు . ఆమె చేసిన ట్వీట్ లో ఎవరు ఎంత ఎలా అర్థం చేసుకుంటే అంత అర్థం చేసుకోవచ్చని మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు . ఇక ఇంతకీ సిగ్గులేనిది ఎవరికి అంటూ ముచ్చటించుకుంటున్నారు ప్రజలు .
ఇంకొందరు అయితే మరి ఇంత డైరెక్ట్ గా నా అంటూ ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు . ఏదేమైనప్పటికీ ఓజీ విషయంలో పెద్ద వారే జరుగుతుందని చెప్పుకోవచ్చు . సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఓ జి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే . తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ప్రెసెంట్ థియేటర్లను షేర్ చేస్తుంది . సుచిత్ డైరెక్షన్ ఒక ఎత్తు అయితే తమన్ మ్యూజిక్ మరొక ఎత్తుగా నిలిచిందని చెప్పుకోవచ్చు . మరి రానున్న రోజుల్లో ఈ మూవీ ఎంత మేరా కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి .