
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి ఓజి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ కి విచ్చేశాడు . పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఓజి మూవీ సెప్టెంబర్ 25 వ తారీఖున థియేటర్లలో రిలీజ్ అయింది . ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . ఇక సుజిత్ డైరెక్షన్ కి సూట్ అయ్యే విధంగా తమన్ సంగీతం అందించడంతో ప్రజెంట్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని చెప్పుకోవచ్చు . ఇక పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా చూసేందుకు పలువురు స్టార్ హీరోలు థియేటర్లకి విచ్చేస్తున్నారు .
ఇప్పటికే సాయి ధరంతేజ్ మరియు వరుణ్ తేజ్ , కిరణ్ అబ్బవరం, ప్రభాస్ ఇలా హీరోలే కాకుండా పలువురు డైరెక్టర్లు కూడా సినిమాని చూసి థియేటర్లలో సందడి చేస్తున్నారు . ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా ఓజీ సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్ళాడు . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ వీడియో చూసిన వారంతా.." మా డిప్యూటీ సీఎం తో ఏమన్నా పని ఉందా . ఇలా కాక పడదాం అనుకుంటున్నావా? ఒకప్పుడేమో వైయస్సార్ పార్టీకి మద్దతు తెలిపావు ఇప్పుడు మా పవన్ సినిమా చూసేందుకు ఎందుకు వచ్చావు? " అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు .