
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదిస్తున్న ఒక యంగ్ తెలుగు యాంకర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈమె చేస్తున్న పనులు, పోస్ట్ చేస్తున్న వీడియోలు, చెప్పే కామెంట్లు అన్నీ హాట్ టాపిక్‌లుగా మారుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు ఉన్నా, వాళ్లు ఎప్పుడూ ఒక హద్దు పాటిస్తారు. ఎప్పుడూ తమ మాటల్లో వల్గారిటీ లేకుండా, ఎవరినీ దూషించకుండా మాట్లాడతారు. కానీ ఈ యంగ్ బ్యూటీ మాత్రం వేరే రూట్ పట్టిందని అంటున్నారు. ఇండస్ట్రీలో తన క్రేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో నానా రకాల ట్రిక్స్‌కి దిగుతోంది. ఎలా అంటే – ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ స్టార్ హీరో ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ఆ విషయాలపై తన ఓన్ ఒపీనియన్ చెప్పేస్తుంది. కొన్నిసార్లు స్టార్ హీరోలు, హీరోయిన్‌లు గురించి మాట్లాడే విధానం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
“క్రేజ్ కోసం ఇలాంటివి కూడా చేస్తారా?” అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం “ఇండస్ట్రీలో ఉండే వాళ్లు ఇలా తమ సహచరుల గురించి మాట్లాడడం ఎలా సరికాదు?” అంటూ మండిపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ యాంకర్ సోషల్ మీడియా అకౌంట్ ఓసారి ఓపెన్ చేస్తే, అందులో ఎక్కువగా స్టార్ సెలబ్రిటీల ప్రైవేట్ ఫంక్షన్లు, వైరల్ వీడియోలు, హాట్ టాపిక్స్ గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. జనాలకు ఉపయోగపడే అంశాల కంటే కూడా, ట్రెండింగ్ సెలబ్రిటీ న్యూస్‌నే ఎక్కువగా హైలైట్ చేస్తోంది.
దాంతో జనాలు ఈమెపై నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. “అసలు యాంకర్‌గా ఉన్నవాళ్లు ఇలాంటివి చేయడం సరైన పద్ధతి కాదు” అంటూ కొందరు ఫైరవుతున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం “ఇది సోషల్ మీడియా యుగం, ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉంది” అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో ఈ యాంకర్ పేరు హాట్ టాపిక్‌గా మారిపోయింది..!!