బాహుబలి మరణించిన తర్వాత అతని ఆత్మ పాతాళలోకానికి వెళ్లడం అక్కడ శివలింగం ముందు బాహుబలి డాన్స్ చేయడం వంటివి ఇందులో చూపించారు. బాహుబలి కోసం అటు ఇంద్రుడు, విశాసురుడు భీకరమైన యుద్ధంతో పోరాడుతున్నట్లు చూపించారు. అయితే చివరికి విశాసురుడు ఓడిపోతారు. ఆ తర్వాత బాహుబలి యమలోకానికి వెళ్లడం వంటివి ఇందులో చూపించారు. చూస్తూ ఉంటే బాహుబలి యానిమేషన్ చిత్రం ఏదో కొత్త కాన్సెప్ట్ తోనే తీసుకురాబోతున్నట్లు కనిపిస్తోంది డైరెక్టర్.అయితే ఇది కూడా మొదటి భాగమే అన్నట్లుగా టీజర్ లో చూపించారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ కూడా రెండు భాగాలుగా విడుదల చేస్తారా లేదా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
బాహుబలి ది ఎటర్నల్ వార్ చిత్రాన్ని డైరెక్టర్ ఇషాన్ శుక్ల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2027 లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి సమర్పికుడుగానే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పనులు అయితే శరవేగంగానే జరుగుతున్నాయి. సినిమా స్క్రిప్ట్ కూడా చాలా కొత్తగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆకాశంలో బాహుబలి చేసే యుద్ధ సన్నివేశాలు వంటివి చూపించబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రభాస్ ని చూపించిన తీరు కూడా యానిమేషన్ గా అద్భుతంగా ఉన్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి