శివ (జి.వి.ప్రకాశ్) ఓ బ్రిలియెంట్ స్టూడెంట్ ట్వెల్త్ స్టాండర్డ్ చదువుతున్న శివకు అదే క్లాస్ చదువుతున్న మాయ (శ్రీ దివ్య) అంటే చాలా ఇష్టం. ఆమెను ఎప్పటినుండో ప్రేమిస్తూ ఆరాధిస్తాడు శివ. మాయ ఓ పోలీస్ కమిషనర్ కూతురు కాబట్టి ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఇక అదే క్లాస్ ఓ స్టార్ హీరో కొడుకు నితిన్ (షరిక్ హాసన్) క్లాస్ లో అందరిని తన కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తుంటాడు. అంతేకాదు అమ్మాయిలను కూడా మోసం చేస్తూ వారిని బ్లాక్ మేల్ చేస్తూ ఉంటాడు. ఇక అతను చేసే పనులన్ని ప్రిన్సిపాల్ కు తెలిసినా సూపర్ స్టార్ కొడుకు అవడం చేత అతన్ని మందలించి వదిలేస్తారే తప్ప అతన్ని శిక్షించరు. వి.ఆర్.ఎస్ స్కూల్స్ కు ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ కోసం ఇన్స్పెక్షన్ జరుగుతుంటుంది. ఆ సమయంలోనే నితిన్ హత్య చేయబడతాడు. అసలు నితిన్ ను చంపింది ఎవరు..? శివ నిత్యల గొడవలకు కారణం ఏమిటి..? నితిన్ మర్డర్ మిస్టరీలో మాయ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది..? అన్నది అసలు కథ.
పెన్సిల్ అంటూ ఓ సాఫ్ట్ టైటిల్ తో వచ్చిన జి.వి.ప్రకాశ్ తన పాత్ర వరకు ఓకే అనిపించుకున్నాడు. అయితే కొన్ని చోట్ల హీరో కంటే హీరోయిన్ శ్రీ దివ్య ఎక్కువ మార్కులు కొట్టేసిందని అనాలి. మాయగా ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో అదరగొట్టేసింది శ్రీ దివ్య. సినిమాలో హీరో శ్రీ దివ్యనే అన్న ఫీల్ కలుగక తప్పదు. ఇక మిగతా నటులంతా ఓకే అనిపించుకున్నారు. అయితే నితిన్ గా నటించిన షరిక్ హాసన్ తొలి సినిమానే అయినా మంచి నటన కనబరిచాడు. ఇక స్కూల్ ఇన్స్పెక్షన్ చేసే హయ్యెర్ ఆఫీసర్ గా ఊర్వశి కొద్దిసేపు నవ్వులు పంచే ప్రయత్నం చేసింది. స్కూల్ ప్రిన్సిపాల్ గా నటించిన టి.పి.గజేంద్ర తన మార్క్ కామెడీ చేసి అలరించారు.
పెన్సిల్ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా దర్శకుడు మణి నాగరాజ్ గురించి చెప్పాలి. కార్పోరేట్ స్కూల్ లో జరుగుతున్న అన్యాయాలను చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు ఓ మర్డర్ మిస్టరీని ఎంచుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్ లో నితిన్ ను ఎవరు మర్డర్ చేశారు అన్న కంఫ్యూజన్ మెయింటైన్ చేసినా సినిమాలో కామెడీ లేక పోవడం చాలా పెద్ద మైనస్. ఇక సినిమాటోగ్రఫీ గోపి అమర్ నాథ్ ఓకే అనిపించుకున్నాడు. పాటల్లో తప్పించి మొత్తం స్కూల్ లోనే సినిమా మొత్తం ఉండటంతో ఆయన పనితనం ఎక్కువగా కనబడలేదని చెప్పాలి. ఇక ఆంథోని ఎడిటర్ పర్వాలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో ఎడిటర్, దర్శకుడి సహకారం బాగానే అందిందని చెప్పాలి. ఇక సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా జి.వి.ప్రకాశ్ మంచి కంపోజింగ్ చేశాడు. పాటల వరకు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇక ఎస్.పి రాఘవేష్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే సినిమా మొత్తం ఓ స్కూల్ కాంపస్ లోనే కానిచ్చేయడం విశేషం.