ఆ మద్య ప్రభుదేవపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత ప్రభావం పడుతుందని అనుకోలేదని..అసలు ప్రభుదేవనే కాదు.. ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడం లేదు. ఆయన నాకు మంచి ఫ్రెండ్, శ్రేయోభిలాషి ప్రభుదేవాను ‘సార్’ అని తాను పిలుస్తానని స్పష్టం చేసింది. కొమరం పులి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు నికీషా పరిచయమైంది. ‘ఓమ్’, ‘అరకురోడ్డు’, ‘గుంటూరు టాకీస్ 2’ చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ నికీషా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘తేదీ మెహర్బానియా 2’ అనే చిత్రంలో నటిస్తోంది.
గతంలో ప్రభుదేవ, నయన తార మద్య లవ్ ఆఫైర్ పెళ్లి వరకు వచ్చింది..కానీ అనుకోని కారణాల వల్ల వీరి మద్య దూరం పెరగడం..బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత తమన్నాతో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినా..ఆ విషయంపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నికీషా పటేల్ వ్యవహారంపై ప్రభుదేవ ఎలా స్పందించనున్నారో తెలియాలి.