ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కథకు సంబంధించిన స్టోరీలైన్ ను ఈరోజు ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక అత్యంత ప్రముఖంగా ప్రచురించింది. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కథ 1920 ప్రాంతానికి చెందిన ఒక పీరియడ్ డ్రామాతో ఉంటుందని ఆపత్రిక కథనం. 1920 ప్రాంతంనాటి భారతదేశ పరిస్థుతులు అప్పటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ప్రధానాంశంగా ఈమూవీ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుందని సమాచారం.

అయితే చరణ్ జూనియర్ లు గెటప్ లకు సంబంధించి వాడబోయే కాస్ట్యూమ్స్ 1920 ప్రాంతంనాటి పరిస్తుతులను ప్రతిబింబించేలా ఉండటమే కాకుండా అలనాటి పరిస్తుతులను మనకు గుర్తుకు తెచ్చే విధంగా ఒకభారీ సెట్ గండిపేట ప్రాంతంలో ఇప్పటికే తయారైనట్లు తెలుస్తోంది. సుమారు 10 రోజులు ఈ సెట్ లోనే నవంబర్ లో ఈమూవీ షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం. 

అదేవిధంగా రాజమౌళి సినిమాలకు సెంటిమెంట్ గా పనికి వచ్చే అల్యూమినియం ఫ్యాక్టరీలో వేరే సెట్ నిర్మాణం జరగడంతో అక్కడ కూడ ఈసినిమాకు సంబంధించిన ఈసీన్స్ చిత్రీకరిస్తారని టాక్. వాస్తవానికి ఈమూవీ కథ 1920 ప్రాంతంనాటిది అయినా సినిమా ప్రస్తుతకాలంతో మొదలై కొద్ది సేపటికే రాజమౌళి ‘మగధీర’ టెక్నిక్ ను అనుసరిస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుందని ఆపత్రిక తన కథనంలో పేర్కొంది. 

రచయిత విజయేంద్ర ప్రసాద్ సమకూర్చిన ఈకథ ప్రస్థుత తరం ఆలోచనలలో తగ్గిపోతున్న దేశభక్తిని పెంపొందించే విధంగా చాల ఉద్వేగభరితంగా ఉంటుందని తెలుస్తోంది. చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు రావడానికి మరో నెలరోజులు గడువు కోరిన నేపధ్యంలో నవంబర్ లో జరగబోయే షూటింగ్ అంతా జూనియర్ తో పాటు మరికొంతమంది కీలక నటులతో ఈమూవీ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని ఆపత్రిక పేర్కొంది. ఈసినిమాను చూస్తున్నంత సేపు సాధారణ ప్రేక్షకుడు అలనాటి స్వాతంత్రోద్యమ సమయంలో తాను కూడ జీవించి ఉన్నానా అన్న ఫీల్ వచ్చే విధంగా ఈమూవీ సెట్స్ డిజైన్ తో పాటు గ్రాఫిక్స్ కూడ ఉంటాయని సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: