మెగాస్టార్ చిరంజీవి అంటే ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ స్టార్. ఎంత
స్టార్ అయిన ఇంట్లో తన తరువాత పుట్టిన వాళ్లకు అన్నయ్య కదా. వాళ్ళను
కేరింగ్ గా చూసుకునే బాధ్యత మెగాస్టార్ కు ఉన్నది. ఇంట్లో పెద్ద కాబట్టి
మెగాస్టార్ చిన్నప్పటి నుంచి ఇంట్లో అన్ని పనులు తానుగా చేస్తుండేవాడు.
అయితే,
ఓసారి చిరంజీవి ఒకే సమయంలో రెండు పనులు చేయాల్సి వచ్చింది. నాగబాబుకు ఓ
పనిని అప్పగించి చిరు, వేరే పనికోసం బయటకు వెళ్లి వచ్చాడు. వచ్చే సరికి
నాగబాబు చెప్పిన పని చేయలేదు. ఎందుకు చేయలేదని అడిగితె.. నిద్రపోయానని
చెప్పాడట.
దీంతో మెగాస్టార్ కు కోపం వచ్చింది.
ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. దీంతో నాగబాబు ఈ విషయాన్ని తల్లికి
చెప్పడంతో ఆమె చిరంజీవిని మందలించింది. తమ్ముడిని చూసుకునే విధానం ఇదేనా
అని ప్రశ్నించింది. చిరంజీవి తల్లి మాటలకు విని అలిగాడట.
ఈలోగా
ఇంటికి వచ్చిన తండ్రి అది గ్రహించి మెగాస్టార్ ను దగ్గరికి తీసుకొని
నాగబాబును మందలించడంతో మెగాస్టార్ మనసు కుదుటపడింది. ఆ తరువాత నాగబాబు
ఎప్పుడు మందలించలేదట. సినిమాల్లోకి వచ్చిన తరువాత నాగబాబు నిర్మాతగా మారి
అనేక సినిమాలు తీశాడు.