యవ్వనం ఓ నందనం అంటాడు సినీ కవి. అక్కడ విరబూసిన అందాలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. అమాయకంగా తన, పర తేడా లేకుండా నందనవనం
సౌందర్య ప్రదర్శన చేస్తూనే ఉంటుంది. కళ్ళు ఉంటే చాలు అస్వాదించేందుకు. అంతటి త్యాగ నిరతి మళ్ళీ ఎవరికి ఉంటుంది అంటే అందాలు నిండుగా నింపుకోవడమే కాదు, గుండె నిండా మనసున్న కొద్ది మందికి మాత్రమే అది సాధ్యం అనాలి. ఇపుడు ఆ జాబితాలో హాట్ హాట్ బేబీ
హెబ్బా పటేల్ చేరిపోయింది.
అందం చూడవయా ఆనందించవయా అంటోంది హెబ్బా. ఓయబ్బా అని కళ్ళప్పగించమంటోంది. ముందుగా ఈ కుర్ర కుమారం గురించి చెప్పాలి కదూ,
కుమార్ 21 లో తెగ కిర్రెక్కించినా కూడా హెబ్బాకు సరైన చాన్సులు మాత్రం రాలేదు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నా కూడా ఎందుకో
టాలీవుడ్ వాడుకోలేక పోయింది. దీంతో ఒకటి రెండు హిట్లు తప్ప
హెబ్బా పటేల్ సినిమా ప్రోగ్రస్ కార్డు లో మరెమీ మెరుపుల్లేవు. అలా అని కూర్చునే కాదు ఈ కుమారం. అందుకే సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. తాను ఎక్కడా తగ్గలేదని గట్టిగా చెబుతోంది. తన సత్తా చాలా ఉందని కూడా అంటోంది.
ఇపుడు ఇన్స్టాగ్రాం లో
హెబ్బా పటేల్ పెడుతున్న పిక్స్ కి కుర్ర కారు ఖుషీ అవుతున్నారు. ఇంతందం ఉన్న
హెబ్బా పటేల్ వెండితెరను పావనం, పవిత్రం చేయాలని మనసారా కోరుకుంటున్నారు. అయితే
టాలీవుడ్ పెద్దలకు కూడా చూపు ఇటు వైపు పడాలి కదా. అంతవరకూ హెబ్బా అందాల తీవ్రత అలాగే ఉంటుందేమో. ఒక్క చాన్స్ ఇస్తే చాలు హీటెక్కించేస్తానని సవాల్ చేస్తున్న
హెబ్బా పటేల్ కి ఆ ముచ్చట తీర్చే మూవీ ఎక్కడ వుందో మరి.