తెలుగు చిత్ర సీమలో మకుటం లేని మహరాజుల్లా వెలిగిన  హీరోలు ఇద్దరు వారే ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. ఆ తర్వాత అంతటి స్థానం.. ప్రజాదరణ ఎవరి సొంతం చేసుకుంటారా అన్న సమయంలో ‘పునాదిరాళ్లు’ సినిమాలో నలుగురు యువకుల్లో ఒకరిగా చిన్న పాత్ర చేసిన యంగ్ హీరో తర్వాత మెగాస్టార్ గా ఎదిగి కొట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ హీరో ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది మన మెగాస్టార్ చిరంజీవి.

ఈయన వారసత్వంగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరో స్థాయిలో పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాం చరణ్ లు దూసుకు పోతున్నారు. చిరంజీవి ప్రజల అభిమానం పొందిన నేపథ్యంలో కొందరి సలహా మేరకు రాజకీయ రంగం ప్రవేశించారు. సొంతగా ‘ప్రజారాజ్యం’ అనే పార్టీ పెట్టి తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో పని చేశారు.  తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రాభల్యం తగ్గిపోవడంతో ఇక చిత్ర రంగం వైపు రావాలని ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఇప్పుటి వరకు చిరంజీవి 149 సినిమాలు తీశారు...ఇప్పుడు తీస్తే అది 150 వ చిత్రం అవుతుంది. ఈ సినిమాపై ఇప్పటి వరకు విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ‘బాహుబలి’ చిత్రంతో  తెలుగు చలన చిత్రరంగంలో తనకెవరు సాటిలేరని చాటి చెప్పకున్న రాజమౌళి ఇప్పుడు చిరుతో మూవీ చేస్తున్నాడానే టాక్ ఫిలింనగర్ లో హాల్ చల్ చేస్తుంది. చిరంజీవి 150 వ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా ఉండాలని ఆలోచనలో ఉండటం వల్ల దర్శకుల విషయంలో రక రకాల చర్చలు వస్తున్నాయి. ఆ మద్య వివివినాయక్ తో సినిమా తీస్తున్నాట్లు కథకూడా ఓకే చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు చిరు నటించబోయే 150వ చిత్రం నుంచి పూరిని తప్పించి అతని స్థానంలో రాజమౌళి దర్శకత్వం వహిస్తురనే వార్తలు గుప్పుమంటున్నాయి.

బాహుబలి చిత్రంలో రానాకు సూచనలు ఇస్తున్నా రాజమౌళి


బహుబలి చిత్రంతో  ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి సత్తా చాటిన రాజమౌళి, చిరంజీవి కాంబినేషన్ అంటే మెగా అభిమానులకు పండగ వాతావరణమే అవుతుంది. చిరు సినిమా గురించి  రామ్ చరణ్ క్లారిటిగా చెప్పారు. నాన్నగారు నటించబోయే 150వ సినిమాకు పూరినే దర్శకత్వం వహిస్తారనే విషయం చెప్పారు. మళ్ళీ ఈ గాసిప్స్ రావడంతో మళ్ళీ చిరు సినిమా దర్శకులు ఎవరు అనేది డైలామాలో పడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: