పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై ఉన్న అభిమానంతో ఓ చిత్రకారుడు 108 పెన్సిల్ స్కెచ్ లతో కేటీఆర్ చిత్రాలను గీశాడు. చిత్రకారులు తమ మనసులో ఏం అనుకుంటున్నారో ఎవరికి అర్థం కావు. తెలియని లోకాన్ని వారి ఆలోచనలతోనే పరిచయం చేయిస్తారు. కొత్త కొత్త ఆలోచనలతో, సరికొత్తగా అందాలను పేపర్లపై ఉంచుతారు.

 

 

కేటీఆర్ పై ఉన్న ప్రేమతో ఎన్నారై చిత్రకారుడు అరవింద్ కేటీఆర్ విభిన్న హావభావాలను ఉట్టిపడేలా ఏకంగా 108 పెన్సిల్ స్కెచ్ లను గీసి చరిత్ర సృష్టించాడు. పెన్సిల్ తో ఒక పొట్రెయిట్ గీయడం చాలా కష్టమైన పని. అలాంటిది ఈ చిత్రకారుడు వెలుగు నీడలు కనిపించే విధంగా.. గాంభీర్యం కలిగిన చిత్రాలను స్పష్టంగా గీశాడు.పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై అభిమానంతో 108 పెన్సిల్ పొట్రెయిట్స్ గీసి అరవింద్ చరిత్రను సృష్టించాడు.

 

 

హైదరాబాద్ కు చెందిన అరవింద్ అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం అందరికి తెలిసిందే. అయితే అరవింద్ కు ఖాళీ సమయం దొరకడంతో కేటీఆర్ చిత్రాలను గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పొట్రియిట్స్ తో చిత్రపటాలను గీసి ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్రాలను కేటీఆర్ కు బహూకరించారు.

 

 

ఇదిలా ఉండగా గతంలో పెన్సిల్ తో ఈ చిత్రకారుడు 108 చిత్రాలను గీసి చరిత్ర సృష్టించాడు. అరవింద్ అప్పట్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చిత్రాన్ని గీసి ఆయనకు బహూకరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పై తనకున్న అభిమానంతో 108 పొట్రయిట్స్ చిత్రపటాలను గీశానన్నారు. ఇప్పటి వరకూ ముంబయికి చెందిన బాల్ ఠాక్రేపై రాజేంద్రకాంతన్ 101 చిత్రాలను గీసి చరిత్ర సృష్టించాడని, ప్రస్తుతం ఆ రికార్డులను బద్దలు కొట్టానని అరవింద్ సంతోషం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: