ఎందుకంటే ఇటీవల పాకిస్థాన్తో జరిగిన ఓ సంఘటన ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయినప్పటికీ పాకిస్తాన్లో ఈ ఘటనకు సంబంధించి ఎవరు నోరు మెదపకపోవడం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే పాకిస్తాన్లో మైనారిటీ వర్గానికి సంబంధించిన హిందూ యువతి పూజ దారుణ హత్యకు గురైంది. ఇక అదే ప్రాంతంలో ఉండే అంకుల్ వయసుండేటువంటి వ్యక్తి వ్యక్తి పెళ్లి చేసుకోవాలి అంటూ పూజ వెంట పడ్డాడట. అయితే తండ్రి అనారోగ్యం బారిన పడడంతో నలుగురు చెల్లెళ్ల బాధ్యతలను భుజాన వేసుకొని మోస్తోంది పూజ.
ఈ క్రమం లోనే ఇంటి బాధ్యత మొత్తం నేనే చూసుకుంటాను పెళ్లి చేసుకో అంటూ ఒత్తిడి తీసుకు వచ్చాడు సదరు వ్యక్తి. అయితే అతనికి అప్పటికే నలుగురు భార్యలు ఉన్నారనే ఐదో భార్య గా రావాలి అంటు ఒత్తిడి తీసుకురావడంతో పూజ అతని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఏకంగా ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి పూజా ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన గురించి కనీసం అక్కడి మీడియా కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. ఈ దారుణ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి