సాధారణంగా ప్రతి యువతి కూడా పెళ్లి విషయంలో కోటి ఆశలు పెట్టుకుంటోంది. నచ్చిన వాడు తన జీవితంలోకి వచ్చి తనను మహారాణిలా చూసుకుంటాడు అని ఆశ పడుతూ ఉంటుంది.  ఇక కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక యువతి జీవితంలో పెళ్లి అనేది జీవితాన్ని గందరగోళంలోకి నెట్టింది. ఏకంగా పెళ్లి ఆ మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైంది. నవవధువు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన ఇటీవలే హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.


 వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ వట్టే పల్లి కి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహీన్ బేగం అనే 25 ఏళ్ల యువతి  కి జల్పల్లి న్యూ బాబా నగర్ నివాసి అయిన ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ అనే యువకుడితో 28 రోజుల క్రితం పెళ్లి జరగడం గమనార్హం. అయితే మూడేళ్ల క్రితమే ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ అన్నయ్యతో షాహీన్ బేగంకి నిశ్చితార్థం జరిగిపోయింది. నిశ్చితార్థం  జరిగిన తర్వాత సోదరులు ఇద్దరూ కూడా ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు  ఇక ఇటీవలే కరోనా వైరస్ నేపథ్యంలో తమ్ముడు ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ అతని అన్న ఆచూకీ మాత్రం తెలియలేదు.


 ఈ క్రమంలోనే ఇక కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారూ. పెద్ద కుమారుడు ఆచూకీ లేకపోవడం.. అప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోవటంతో ఇక దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ తో  పెళ్లి చేయాలి అని అనుకున్నారు. ఈ క్రమంలోనే జూలై 12 వ తేదీన వీరిద్దరికీ పెళ్లి చేశారు ఇరు కుటుంబ సభ్యులు. అయితే సోదరుడితో నిశ్చితార్థం అయిన అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయాడు ఇస్మాయిల్.  ఇక నిన్ను భార్యగా అంగీకరించలేను అంటూ నవ వధువును సూటిపోటి మాటలతో మానసికంగా వేధించేవాడు. అదే సమయంలో ఇక అదనపు కట్నం కోసం అత్తమామలు కూడా వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ జీవితం వృధా అని అనుకుంది షాహిన్ బేగం. ఇటీవలే తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: