చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లో చంద్రబాబు కు ప్రియమైన నేతగా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాలాగే టీడీపీ జెండా అక్కడ చిన్నబోయింది. బొజ్జల కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ రాజకీయ ప్రవేశం చేయగా ఆయన జగన్ మేనియా లో అత్యంత దారుణంగా ఓడిపోయారు.. ఈ ఓటమితో కృంగిపోయిన సుధీర్ హైదరాబాద్ ను వదిలి రావడం లేదట. కరోనా సమయంలోనో నియోజక వర్గ ప్రజలకు అండగా ఉండలేదు.. ఓ వైపు చంద్రబాబు ఎంత మొత్తుకున్నా అందరు టీడీపీ నేతల్లాగే ఇతను బయటకు రావట్లేదట..