బీజేపీ పవన్ ను వాడుకుంటుందా, పవన్ బీజేపీ వాడుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. వాస్తవానికి బీజేపీ కి రాష్టంలో పెద్దగా పేరులేదనే చెప్పాలి.. మొదటినుంచి రాష్టంలో బీజేపీ చాలా వీక్ గా ఉంది. అందులోనూ సరైన నాయకుడు కూడా లేకపోవడంతో బీజేపీ అట్టడుగున ఉంది. ఇప్పుడు హడావుడి చేస్తుంది కానీ గతంలో ఎన్నికల సమయంలో తప్ప బీజేపీ పేరు పెద్దగా వినిపించేది కాదు.. ఇక ఈ ఎన్నికల తర్వాత బీజేపీ హల్చల్ స్పష్టంగా కనిపిస్తుంది.. ఏ వివాదం ఉన్నా టీడీపీ కన్నా ముందే వాలిపోయి ప్రజల్లో ఉండాలనే తపన కనిపిస్తుంది.