విద్యావంతుడు, మేధావిగా పేరొందిన కోదండరాం పట్టభద్రుల కోటాలో జరిగే ఎన్నికలు కాబట్టి ప్రభావం చూపగలరని టీజేఎస్ భావిస్తోంది. దీనికి విపక్షాల అందరి మద్దతు కూడా లభిస్తే విజయం సులవవుతుందని భావించింది. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో విపక్ష పార్టీల అందరితో పాటు కాంగ్రెస్ తో కలిసి కోదండ రాం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతు ఉంటుందని కోదండరాం ఆశించారు. కానీ కాంగ్రెస్ ఈ విషయంలో మళ్ళీ కోదండరాం కు మొండి చెయ్యి చూపిస్తుందని తెలుస్తుంది.