రాష్ట్రంలో గంటా శ్రీనివాస్ రావు గురించి రోజు కో వార్త హల్చల్ చేస్తుంది.. దాంతో ఏపీ రాజకీయం చుట్టూ అయన చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అయన పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఫోకస్ అంతా ఆయనపై పెట్టారు. కానీ ఈ అంశాన్ని గంటా ఎప్పటికప్పుడు పొడిగించడంతో అందరు ఎదో విషయం తేల్చాలని పట్టుపట్టారు.. ఆ కోవలోనే అయన వైసీపీ లోకి వెళ్లాలని ఆసక్తి చూపగా ఆ పార్టీ వారు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించారు..