దుబ్బాక లో సమర శంఖం మోగిన దగ్గరినుండి తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది చెప్పాలి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాలని ఇప్పటినుంచే తమ అస్త్రాలకు పదును పెడుతూ ముందుకు వెళుతుంది.. ఇక బీజేపీ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లు అధికార పార్టీ పై కారాలు మిర్యాలు నూరుతుంది.. ఇక్కడ తామే గెలుస్తామని చెప్తూ అందరిని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.. ఇక అధికార పార్టీ విషయానికొస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం గా మారింది.