తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ నుంచి చాలా మంది నాయకులు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అందులో కొంత మందికి సముచిత స్థానం లభించినా మరికొందరి పరిస్థితి ఇప్పటికీ అయోమయంగానే ఉంది. కాగా తెలుగు దేశం తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాత్రం టీడీపీని వదిలే సమస్యేలేదని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.  ఇప్పటికే ఆయనపై పలు అభియోగాలు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీని నిలదీసే టీడీపి నాయకుడిగా రేవంత్ రెడ్డి పేరు ఎక్కువ గా వినిపిస్తుంది.  
Image result
తాజాగా వైజాగ్ లో తెలుగు దేశం మహనాడు జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ వారికి సముచితమైన స్థానం ఇవ్వడం లేదని..ఎలిమినేటి మాధవరెడ్డి తనయుడు, మహిళా నాయకురాలు కవిత మండి పడ్డారు.  ఇక పార్టీకి సంబంధించిన కీలక సమావేశం జరుగుతున్న సమయంలో...రేవంత్ రెడ్డి మధ్యలోనే నిష్క్రమించడం ఈ అనుమానాలకు తావిచ్చింది. దీంతో వెంటనే మీడియాలో దీనిపై రక రకాలు గా కథనాలు వచ్చాయి.  
Image result for vizag mahanadu
రేవంత్ మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయారు? అని పలువురు ఆరా తీయడం మొదలుపెట్టారు. సహజంగానే ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు.. విభేదాలేమైనా పొడచూపాయా? అన్న అనుమానాలు కలిగాయి.  అసలు విషయానికి వస్తే..కేవలం వ్యక్తిగత ఆరోగ్య కారణాల రీత్యా.. ఆయన మధ్యలోనే వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. జ్వరం, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న రేవంత్.. హోటల్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లినట్లు సమాచారం.  

Image result for vizag mahanadu



మరింత సమాచారం తెలుసుకోండి: