Image result for narayana chandrababu

ధన సంపద సాధించటానికి కావలసింది పరిశ్రమలు వ్యాపారాలు కానే కాదు. జస్ట్ రాజకీయం చాలు. కుటుంబ సభ్యులు, బందువులు, కులం ప్రధాన అంగబలం ఆపై రాజకెయ అధికారం చాలు రెండెకరాల ఆసామి వందల వేల కోట్లకు అధిపతికావటానికి. 

naidu

భారత దేశంలోని మొత్తం 31 రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో 24 మంది అంటే 81 శాతం అనంత సంపద మూట కట్టుకున్న కోటీశ్వరులేనని - భారత్లో ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న "అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌-ఏడీఆర్‌" తన నివేదికను వెలువరించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచినట్లు ఏడీఆర్‌ తెలిపింది. 

Related image

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.129 కోట్లకు పైగా సంపదతో రెండోస్థానంలో, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రూ.48 కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశంలో ముఖ్య మంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రుల  ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, "నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ - ఎన్‌ఎల్‌డబ్ల్యూ"లు ఈ నివేదికను రూపొందించాయి.

Related image

భారత్ లోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.30 లక్షలు, జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రూ.56 లక్షల సంపదతో తర్వాతి స్థానాలో నిలిచారు.

Image result for poorest chief ministers of india manik mamata mahabuba singla image

మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది 35శాతం మందిపై  క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో తెలిపింది. దాదాపు 26 శాతం ముఖ్యమంత్రులపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే, మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్‌ సాధించినట్లు పేర్కొంది. 

Image result for poorest chief ministers of india manik mamata mahabuba singla image

ఇంకేం భారత దేశం లోనే అత్యధిక సంపద పోగేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగా, శాసన సభ సభ్యుడు నాయారాయణ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు, తెలుగు దేశం పార్టీకి చెందినవారే. ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఇద్దరూ అత్యధిక సంపన్నులుకావటం ఆ రాష్ట్రాన్ని అభివృద్ది చెందిన సుసంపన్న రాష్ట్రం గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఉండవచ్చు.

Image result for mahabooba mufti

Richest Chief ministers in India

  1. Chandrababu Naidu (Andhra Pradesh) 177 Cr
  2. Pema Khandu (Arunanchal Pradesh) 129 Cr
  3. Amarinder Singh (ppunjab) 48 Cr
  4. K.Chandrasekhar Rao (Telanagana) 15.15 Cr
  5. Mukul Sangma (Meghalaya) 14.5 Cr
  6. Siddaramaiah (karnataka) 13.61 Cr
  7. Naveen Patnaik (odisha) 12.06 Cr
  8. Pawan Chamlinng (Sikkim) 10.7 Cr
  9. Narayanasamy (Puducherry) 9.65 Cr
  10. Lal Thanhawla (Mizoram) 9.65 Cr
  11. Vijay Kumar Rupani (Gujarat) 9.09 Cr
  12. Palaniswami (Tamilnadu) 7.8 Cr
  13. Manohar Parikar (Goa) 6.29 Cr
  14. Shivraj Singh chouhan ( Madhya Pradesh) 6.27 Cr
  15. Raman Singh (Chattisgarh) 5.61 Cr
  16. Devendra Fadnavis (Maharastra) 4.34 Cr
  17. Vaundhra Raje (Rajashtan) 4.04 Cr
  18. Jai Ram Thakur (Himachal Prfadesh ) 3.27 Cr
  19. Arvind Kejriwal (Delhi) 2.09 Cr
  20. TR Zeliang (Nagaland) 1.96 Cr
  21. Sarbananda Sonawal (Assam) 1.85 Cr
  22. Nitish Kumar (Bihar) 1.71 Cr
  23. Nongthombam Biren (Manipur) 1.56 Cr
  24. Trivendra Singh Rawat (Uttarakhand) 1.15 Cr
  25. Pinarayi Vijayan (Kerala) 1.07 Cr
  26. Adityanath Yogi (Uttar Pradesh) 95 Lakhs
  27. Raghubar Das (Jharkhand) 72 Lakhs
  28. Manohar Lal Khattar (Harayana) 61 Lakhs
  29. Mehbooba Mufti (Jammu & Kashmir) 56 Lakhs
  30. Mamata Baneerjee (west Bengal) 30 Lakhs
  31. Manik Sarkar (Tripura) 26 Lakhs

మరింత సమాచారం తెలుసుకోండి: