ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్ క్రైం చేసారు అంటూ జగన్ మోహన్ రెడ్డి మండి పడ్డారు. రీసెంట్ గా మీడియా తో మాట్లాడిన ఆయన ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద రైడ్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకి వచ్చాయి అన్నారు " తెలుగు దేశం పార్టీ కి చెందిన సేవా మిత్ర అనే యాప్ ఉంది. దాన్ని తయారు చేసింది ఎవరు అంటే .. ఐటీ గిర్డ్ వారు చేసారు.
Image result for jagan press meet

తెలుగు దేశం పార్టీ కి సంబందించిన ఇదే యాప్ లో ఉండకూడని డేటా మొత్తం పొందు పరిచి ఉన్నారు. ఆధార్ డిటైల్స్ .. తో పాటు అనేక డిటైల్స్ ఉన్నాయి. స్ట్రిక్ట్ గా ప్రైవేటు వ్యక్తుల దగ్గర కానీ కంపెనీల దగ్గర కూడా ఉండకూడని ఈ డీటైల్స్ ఏ రకంగా సేవా మిత్రా యాప్ లో కనపడుతూ ఉన్నాయి? ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వారి కంప్యూటర్ లలో దొరుకుతూ ఉన్నాయి.
Related image
ఒక ప్రైవేటు కంపెనీ దగ్గర దొరకడం తెలుగు దేశం పార్టీ వారికి చెందిన యాప్ లో దొరకడం సబబే నా ? ఇది క్రైం కాదా ? ఇది ప్రైవసీ ని దోచుకోవడం కాదా ? ఓటర్ల డేటా తో పాటు కలర్ ఫోటో లు కూడా కనిపిస్తున్నాయి. మాస్టర్ కాపీ లు కనిపిస్తున్నాయి. ఇంతకంటే దారుణం ఉంటుందా ? ఈ మాస్టర్ కాపీ అనేది ఎవరికీ అందుబాటులో ఉండనివి కూడా ఏ రకంగా ఐటీ గ్రిడ్ అనే ఆఫీస్ లో కనిపిస్తూ ఉన్నాయి?
Image result for jagan press meet
ఏ రకంగా సేవా మిత్రా అనే చోట ఇవి పెట్టారు? అంటే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క డేటా ఇది .. కేంద్ర ప్రభుత్వ డేటా ఏమో ఆధార్ డేటా .. బ్యాంక్ ఎకౌంటు డీటైల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. రాష్ట్రము లో ఉన్న జనం యొక్క బ్యాంకు ఎకౌంటు డీటైల్స్ వీళ్ళ దగ్గర ఉంటున్నాయి. ప్రైవేటు వ్యక్తులకి సంబంధించిన బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో ఏ రకంగా ప్రత్యక్షం అవుతున్నాయి ?
Image result for jagan press meet
చంద్రబాబు గారి తెలుగు దేశం పార్టీ కి చెందిన యాప్ సేవా మిత్ర లో ఏ రకంగా ప్రజలకి సంబంధించిన వ్యక్తిగత బ్యాంకు డీటెయిల్స్ ఏ రకంగా ఉంటాయి .. ఆధార్ , బ్యాంకు డీటెయిల్స్ , ఫోన్ నెంబర్ లు , కలర్ ఫోటో కూడిన ఎలక్త్రొరల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీ దగ్గరే .. దీని అర్ధం ఏంటి ? రేప్పొద్దున మీరేమి చేసినా కూడా ప్రజలు మోస పోరా అని అడుగుతున్నా ..
Image result for jagan press meet

ఈ రకమైన డీటైల్స్ ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉండకూడదు.. సర్వేలు చేసిన డేటా కూడా అందులో దాచుకున్నారు. అన్నీ అనుసంధానం చేసి రిజిస్టర్ ఐన తెలుగు దేశం పార్టీ నాయకులకి ఈ డేటా పంపుతున్నారు. సో వాళ్ళు కావాల్సిన ఓట్లు తీసేసి వాళ్లకి కావాల్సిన డూప్లికేట్ ఓట్లు వేసుకుంటున్నారు .. పోయిన సారి కేవలం 1% తో మేము ఓడిపోయాం సో ఈ సారి ప్రతీది మేము జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం .. ఈ దేశం లో ఎవ్వరూ చెయ్యని సైబర్ క్రైమ్ ని చేసారు చంద్రబాబు " అంటూ జగన్ ధ్వజమెత్తారు !


మరింత సమాచారం తెలుసుకోండి: