మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అంటే తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన జనసేన పార్టీ పెట్టి యువతలో మంచి జోష్ నింపారు.  కానీ పోటీలో మాత్రం నిలబడలేదు..ఆ సమయంలో టిడిపి, బిజేపికి మద్దతు పలికారు.  ఇప్పుడు ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడ్డారు.  కొంత కాలంగా ముమ్మర ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పడు ఏపిలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను చిత్తు చేయడానికి ఎన్ని వ్యూహాలు పన్నాలో అన్ని వ్యూహాలు పన్నుతున్నారు. 


తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ మాట్లాడుతూ...ఏపిలో కొన్ని పార్టీలు నేను ఎమ్మెల్యే కాకూడదని.. ఎమ్మెల్యే అయితే వీడు మా తాట తీస్తాడనే భయంతో నన్ను ఓడించడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఎన్ని వందల కోట్లయినా ఖర్చుచేయండి. నేను అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతా. ఇది నా ఛాలెంజ్‌. మార్పు తథ్యమ’ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇక జనసేన లో పెద్ద నాయకులు లేరని..సీనీయిర్టీ గురించి మీరా ప్రశ్నించేది. 


మీరు పుట్టగానే పెద్ద పెద్ద నాయకుల్లా ఎదిగిపోయారా..? పంచకర్ల రమేష్‌బాబు ఎక్కడి నుంచి వచ్చారు? స్టీల్‌ప్లాంట్‌లో తుక్కు అమ్ముకున్నవాళ్లు ఎమ్మెల్యే అయిపోయారు.. జనసేన నాయకులు అంత మలినమైన వారు కాదు... అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు పార్లమెంటు క్యాంటీన్‌లో ఉచిత భోజనం తిని భుక్తాయాసంతో నిద్రపోతుంటారు. వీళ్లా మన నేతలు? రెండేళ్లు జైల్లో ఉన్న వ్యక్తి సీఎం అయిపోదామని అనుకుంటున్నారు..ఇందకన్నా ఘోరమైన విషయం ఎక్కడైనా ఉంటుంది.


నేను ఏ నేరం చేయలేదు..ప్రజలే నా దేవుళ్లు అని బతుకుతున్న వాడిని...వారి కష్టసుఖాలు తెలుసుకున్న వాడిని..నా పార్టీ తరుపున నిలబడి..  అందరికీ అందుబాటులో ఉండే మంచి వ్యక్తి సుందరపు విజయ్‌కుమార్‌ ఎమ్మెల్యే అవ్వకూడదా’ అని ప్రశ్నించారు. ఏమీ లేకపోయినా నేను రోడ్లపై తిరుగుతున్నా... ఎమ్మెల్యే అయితే ఊహించుకోండి అంటూ పవన్ కళ్యాన్  యువతలో ఉత్సాహాన్ని నింపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: