జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోలార్, పవన్ విద్యుత్ గురించి ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్న ఇటువంటి సమయంలో కొత్తగా వచ్చిన ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలోని కోలిమిగుండ్ల మండలంలో 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటుకు భూమిని కేటాయించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.అలాగే కడపలోని 1,000 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్కుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను ప్రభుత్వం వారంలో పరిష్కరిస్తుందని ఆమె చెప్పారు.

 

కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం నిర్వహించిన ఇతర రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో  సౌర విద్యుత్ ఉత్పత్తి అలాగే పునరుత్పాదక విద్యుత్ ప్రతిపాదనలపై జరిగిన సమీక్షా సమావేశంలో నీలం సాహ్నీ మాట్లాడుతూ, “సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) లిమిటెడ్ ముందుకు వచ్చింది. కర్నూలు జిల్లాలోని  కోలిమిగుండ్ల మండలం లో 4,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు. ఈ ప్రతిపాదనకు భూ కేటాయింపులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అని తెలుస్తుంది. అదే విధంగా, కడపలో కూడా 1,000 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు వారంలో అడ్డంకులను తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు అని తెలియచేసారు. ”

 

అలాగే అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల పరిస్థితిని ఆమె వివరించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ యొక్క మొదటి, రెండవ దశలలో వివిధ ప్రాజెక్టులు వివిధ దశలలో పనులు జరుగుతున్నాయి అని ఆమె గుర్తించారు.

 

కర్నూలులో ఇది వరకే స్థాపించబడిన 1,000 మెగావాట్ల సోలార్ అల్ట్రా మెగా పార్క్ అలాగే  సౌర విద్యుత్ తరలింపు పథకం కింద తలారీలో 500 మెగావాట్ల సోలార్ పార్క్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె గమనించారు.ఈ సమావేశంలో ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి కూడా పాల్గొన్నారు. సౌర విద్యుత్ కి మన రాష్ట్రం ఎంతో అనుకూలం అని మన అందరికి తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: