ఒకప్పుడు మంచి ఉద్యోగం రావాలన్నా, జీవితంలో స్థిరపడాలి అన్నా, సినిమాల్లో మంచి అవకాశాలు రావాలి అన్నాకూడా అదృష్టం ఉండాలి.  అలాంటి అదృష్టం అందరికి దొరకదు.  దొరికినా కూడా చాలా రేర్ గా దొరుకుతుంది.  అలా అవకాశం దొరికినపుడు ఏ మాత్రం ఆలస్యం చేయడానికి ఇష్టపడరు. వార్డు మెంబర్ కావొచ్చు, పంచాయితీ సర్పంచ్ కావొచ్చు... ఎమ్మెల్యే, ఎంపీ కావొచ్చు అవకాశం వచ్చినపుడు ఎన్నికల్లో విజయం సాధిస్తే... ఆ కిక్కే వేరు.  


ఇక ఇదిలా ఉంటె, ఎన్నికల్లో కుటుంబంలో ఒకరు గెలిస్తే గొప్ప అనుకునే ఈ కాలంలో ఒకే ఇంట్లో ఇద్దరు గెలిస్తే ఎలా ఉంటుంది.  ఆ ఇద్దరు కూడా సవతులు అయితే ఇంకెలా ఉంటుంది.  ఆ భర్త ఫుల్ ఖుషి అవుతాడు కదా.  ఇలాంటి సంఘటన తమిళనాడులో జరిగింది.  తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ధనశేఖరన్‌ స్థానిక సహకార సంఘం రేషన్ దుకాణంలో ఉద్యోగిగా పని చేస్తున్నారు.

ఈయనకు ఇద్దరు భార్యలు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వీరు పోటీ చేయగా.. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఇద్దరూ జయకేతనం ఎగురవేశారు. ధనశేఖరన్‌ మొదటి భార్య సెల్వీ.. వజూర్‌ అగ్రహారం పంచాయతీ నుంచి తిరిగి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లోనూ సెల్వీ ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు.


ఇక రెండో భార్య కాంచన.. కోయిల్‌ కుప్పమ్‌ పంచాయతీ నుంచి గెలుపొందారు. ధనశేఖరన్‌ భార్యలిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ధనశేఖరన్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్‌.  ధనశేఖరన్ కు ఇది డబుల్ బొనాంజా అని చెప్పాలి. ఇద్దరు భార్యలు రాజకీయాల్లో ఉంటె ఆ భర్తకు అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి.  ఖుషి ఖుషి అవుతాడు కదా. రెండు గ్రామాల నుంచి ఎలాంటి పనులు కావాలన్నా సరే ఆ కుటుంబాన్ని సంప్రదించాల్సిందే.  ఉన్న ఒక్క భార్యకే ఇబ్బందులు పడుతుంటే అతను ఇద్దర్ని చేసుకొని, ఆ ఇద్దరు కూడా ఎన్నికల్లో విజయం సాధించడం అన్నది గ్రేట్ అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: