జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు అమరావతి లో అక్రమంగా భూములను కొనుగోలు చేశారని... బినామీలకు లాభం చేకూరేలా  అమరావతిలో  ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ సర్కార్  రెండు అంశాలలో చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అందులో ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్... గుంటూరు విజయవాడ మధ్య అమరావతి నిర్మిస్తామని ముందుగానే చంద్రబాబు తమకు కావాల్సిన వారు అందరికీ చెప్పి అమరావతి లో భారీగా భూములు కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించారని వైసీపీ సర్కార్ ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా అమరావతిలో చంద్రబాబు కు సంబంధించిన భూములు సహా చంద్రబాబు కు కావలసిన వారికి సంబంధించిన భూముల ధరలు పెరిగేల పక్కనే ఉన్న రైతుల భూములను గ్రీన్ జోన్గా ప్రకటించి భూముల విలువలను పెంచినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

 

 చంద్రబాబు తన భూములు తమకు కావాల్సిన వారి  భూములు ధరలు పెరగడానికి రైతుల భూములకు గ్రీన్ జోన్  ప్రకటించడంతో అక్కడ రైతులు ఎలాంటి నిర్మాణాలు కట్టుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. దీంతో... పక్కనే ఉన్న భూముల అన్నింటికీ ఎక్కువగా ధరలు పెరిగి పోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గుంటూరు విజయవాడ హైవే పక్కన ఉన్న కొన్ని ఎకరాలలో టిడిపి నేత మురళీ మోహన్ జయభేరి వెంచర్ పడమర ఫేస్ లో ఉంటుంది. అదే పక్కనే ఉన్న రైతుల భూములు మాత్రం తూర్పు ఫేస్ లో ఉంటాయి. ఈ నేపథ్యంలో వాస్తు ప్రకారం కూడా తూర్పు పేస్ లో  ఎక్కువగా భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే చంద్రబాబు రైతుల భూములను అన్నింటిని గ్రీన్ జోన్ గా  ప్రకటించడంతో... మురళీమోహన్ కు చెందిన జయభేరి వెంచర్లోభూములు  ఎక్కువ ధర పలికేలా చేయడానికి నిర్ణయించారని వైసీపీ నేతలు అంటున్న మాట. 

 


 తాజాగా దీనికి సంబంధించిన ఆరోపణలతోనే అమరావతి రైతులతో కలిసి అమరావతి ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో జయభేరి వెంచర్ కోసం వందల ఎకరాల రైతుల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటించారని జగన్మోహన్ రెడ్డి దగ్గర  రైతులు సహా... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తెలపడంతో... వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రైతుల భూముల కు గ్రీన్ జోన్ తొలగించేందుకు నిర్ణయించారు అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్ని రోజుల వరకు మురళీమోహన్ జయభేరి వెంచర్ భూముల ధరలు పెరిగేలా... రైతుల భూములకు గ్రీన్ జోన్  ఉండగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ గ్రీన్ జోన్ ను  తొలగించడంతో రైతులు తమకు అనువైన విధంగా ఆ భూమిని వినియోగించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: