కరోనా వస్తే పారిసెట్మాల్ గోలీ వేసుకుంటే అదే పోతది.. అంటూ మొదట్లో కేసీఆర్.. ఆ తర్వాత జగన్ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. అయితే అసలు అందులో వాస్తవం ఉందా.. అవును కరోనా పారసెట్మాల్ తో నయం అవుతుందని కేరళ వైద్యులు కొందరు చెప్పారు. మరి అసలు ఏది నిజం..?

 

 

పారసెట్మాల్‌ తో కరోనా నయం అవుతుందా.. చూద్దాం.. కరోనా వైరస్ వచ్చినవాళ్లు 80% మంది జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడి కోలుకుంటారు. వాళ్లకి ఎటువంటి మందులు ఇచ్చినా, ఇవ్వకపోయినా కోలుకుంటారు. అసలు పారసెట్మాల్ ఏం చేస్తుంది.. జ్వరం తగ్గిస్తుంది, జ్వరం వచ్చే ఏ రోగానికైనా ఈ పారసెట్మాల్ జ్వరం నుండి ఉపశమనం ఇస్తుంది.

 

 

ఇదీ వాస్తవం. ఉదాహరణకు మలేరియా, టీబీ, ఫ్లూ వంటి రోగాల్లో కూడా జ్వరం నుండి ఉపశమనం కోసం పారసెట్మాల్ ను వాడుతారు. అట్లానే కరోనా వైరస్ తో వచ్చే జ్వరానికి కూడా పారాసెట్మాల్ వేసుకోవచ్చు. అయితే.. కరోనా వైరస్ తో తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరేవాళ్లకు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో, ఊపిరితిత్తుల్లో నీరు నిండడంతో, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.

 

 

ఇలాంటి వారికి ఆక్సిజెన్ అవసరం పడుతుంది. జబ్బు తీవ్రమైన కేసుల్లో వెంటిలేటర్ అవసరం కూడా రావచ్చు. శ్వాస వ్యవస్థ పనిచేయకపోవడం, గుండెకు హాని జరగడం, కణాలకు ఆక్సిజెన్ అందకపోవడం వంటి లక్షణాలతోనే ఎక్కువగా కరోనా రోగులు చనిపోతుంటారు. అలాంటి వాటిని ఈ పారసెట్మాల్ ఆపలేదు. ఇదీ కరోనా నివారణలో పారసెట్మాల్ కథ.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: